Rohit Sharma sixes' record : రోహిత్ శ‌ర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీ20 ప్రపంచకప్ 2024ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. హిట్ మ్యాన్ ఐర్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

T20 World Cup 2024 : బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో టీమిండియా శుభారంభం చేసింది. మెగా టోర్నీలో త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తుచేసి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో విజ‌యంతో త‌న ప్ర‌యాణం ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్ర‌మంలోనే క్రికెట్ లో మ‌రో అరుదైన మైలురాయిని అందుకుని క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకేఒక్క‌డుగా ఘ‌న‌త సాధించాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్ల‌కు సాధ్యకాని రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా టీ20 ప్రపంచకప్ 2024 జ‌రుగుతోంది. దీనిలో భాగంగా భార‌త్ త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. హిట్ మ్యాన్ కేవలం 37 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో మూడు సిక్స‌ర్లు బాద‌డంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు.

IND VS IRE: అయ్యో రోహిత్ శ‌ర్మ .. మ‌ళ్లీ మ‌ర్చిపోయావా.. ! వీడియో

అంత‌ర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శ‌ర్మ మొత్తం 499 మ్యాచ్ ల‌లో 600 సిక్స‌ర్లు బాదిన ఘ‌న‌త సాధించాడు. రోహిత్ శ‌ర్మ త‌ర్వాత స్థానంలో యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ (553 సిక్స‌ర్లు), షాహిద్ అఫ్రిది (553 సిక్స‌ర్లు), బ్రెండన్ మెకల్లమ్ (478 సిక్స‌ర్లు), మార్టిన్ గప్టిల్ (398 సిక్స‌ర్లు) ఉన్నారు. అయితే, ఐర్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో భుజంపై దెబ్బ తగిలిన తర్వాత 52 పరుగుల వద్ద గాయపడి రిటైర్ హార్ట్ గా క్రీజును వ‌దిలాడు రోహిత్ శ‌ర్మ‌. లేకుంటే హిట్ మ్యాన్ నుంచి మ‌రిన్ని సిక్స‌ర్లు వ‌చ్చేవి.

Scroll to load tweet…

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో భారత స్టార్ పేస‌ర్ చెత్త రికార్డు..