Asianet News TeluguAsianet News Telugu

ఐసీసీ అవార్డుల్లో దుమ్ములేపిన భారత ఆటగాళ్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో సహా

తాజాగా ఐసీసీ 2019 సంవత్సరానికి గానూ ఉత్తమ క్రికెటర్ల అవార్డులను ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో 2019 సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు

Rohit Sharma Named ICC's "2019 ODI Cricketer Of The Year", Virat Kohli Bags "Spirit of Cricket" Award
Author
Hyderabad, First Published Jan 15, 2020, 12:39 PM IST

తాజాగా ఐసీసీ 2019 సంవత్సరానికి గానూ ఉత్తమ క్రికెటర్ల అవార్డులను ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో 2019 సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. గత సంవత్సరం 7 సెంచరీలు సాధించిన టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. 

ఇక భారత కెప్టెన్ కోహ్లీని స్పిరిట్ అఫ్ ది క్రికెట్ అవార్డు లభించింది. అతను మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను చూసి స్టీవ్ స్మిత్ కోసం చీర్ చేయమని చెప్పినందుకు గాను, అలా క్రికెట్ స్ఫూర్తిని పెంపొందించే ప్రవర్తన చూపెట్టినందుకు కోహ్లీకి ఈ అవార్డు లభించింది. 

Also read: నెంబర్ 4 స్థానంలో కోహ్లీ... హెడేన్ అసంతృప్తి

ఆస్ట్రేలియా తరుఫున టెస్ట్ క్రికెట్లో ఒక నూతన శకాన్ని ఆరంభించిన లబుషెన్ కి ఎమర్జింగ్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్ కి వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్రా పోషించిన బెన్ స్టోక్స్ కి సోబర్స్ వరల్డ్ ట్రోఫీ వరించింది. గత సంవత్సరం 59 వికెట్లు తీసిన పాట్ కమిన్స్ కు టెస్ట్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 

భారత యువ బౌలర్ దీపక్ చహర్ టి20 పెర్ఫార్మర్ అఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. గత సంవత్సరం 6/7 ప్రదర్శన వల్ల అతడికి ఈ అవార్డు లభించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios