టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం ముంబయి వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. కాగా... మూడో స్థానాన్ని వదిలేసి నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడేన్ ఏకంగా... కోహ్లీ నాలుగో స్థానంలో దిగడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ చర్యపై ఎందుకు చర్చ జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు. భారత క్రికెట్ ను ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు భారత్ ఆడే చాల మ్యాచులను హెడేన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీలంకతో సిరీస్ లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ నుంచి కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. అతడికిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో లంక సిరీస్ లో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో రాహుల్, ధావన్ లలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై డ్రెస్సింగ్ రూమ్ లో డిస్కషన్ మొదలైంది.

Also Read ఆస్ట్రేలియాతో సిరీస్.. శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్...

ఈ క్రమంలోనే కోహ్లీ తన స్థానాన్ని మార్చుకున్నాడు. తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగి.. తన స్థానం కేఎల్ రాహుల్ కి ఇచ్చాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ నిన్నటి ఆటలో పరవాలేదనిపించినా.. కోహ్లీ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో... విమర్శకులు దీనిపై పెదవి విరుస్తున్నారు.

దీనిపై హెడేన్ స్పందిస్తూ... ‘ విరాట్ కోహ్లీ దాదాపు 230 మ్యాచులు ఆడాడు. అందులో 180 వరకు మూడో స్థానంలోనూ బ్యటింగ్ చేసి పదివేలకు పైగా పరుగులు చేశాడు. బాగా ఆడుతున్న ఆ స్థానం నుంచి కోహ్లీ ఎందుకు తప్పుకోవాలి? ఈ చర్యపై కనీసం చర్చైనా ఎందుకు జరగడం లేదు? అతను మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి.’ అని హెడేన్ పేర్కొన్నాడు.