ఏందిరా మావా ఇది.. ఆర్సీబీ ఇంట్లో సీఎస్కే రచ్చ.. షేక్ చేశారుగా.. !
RCB vs CSK : ఐపీఎల్ 2024 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చిన్నస్వామి స్టేడియంలో ప్లేఆఫ్స్ లో చోటు దక్కించుకోవడం కోసం పోటీ పడుతున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఇరు జట్ల ఫ్యాన్స్ స్టేడియానికి చేరుకుని రచ్చరచ్చ చేస్తున్నారు.
Royal Challengers Bangalore vs Chennai Super Kings : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేఆఫ్స్ దశకు చేరువైంది. ఇప్పటికే మూడు జట్లు టాప్-4 చోటుదక్కించుకున్నాయి. ప్లేఆఫ్స్ అర్హత సాధించిన జట్లలో టాప్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. 4వ స్థానంలో కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రేసులో ఉన్నాయి. శనివారం ఇరు జట్ల 4వ స్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి ఫ్లేఆఫ్స్ కు చేరుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీని కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాయి.
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లు మరోసారి తలపడుతుండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలో మస్తు క్రేజ్ ను తీసుకువచ్చింది. అయితే, ఇరు జట్ల ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంది. శనివారం ఉదయం తమ అభిమాన టీమ్ గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ సంఖ్యలో బైకులతో ర్యాలీ తీశారు. అక్కడ రోడ్లపై ఆర్సీబీ ఆర్సీబీ.. అంటూ హోరెత్తించారు.
తామేమీ తక్కువ కాదంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సైతం చిన్నస్వామి స్టేడియం కు చేరుకుని బెంగళూరు హోం లో రచ్చరచ్చ చేస్తున్నారు. సీఎస్కే.. సీఎస్కే అంటూ హోరెత్తిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ చిన్నస్వామి స్టేడియంకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం వద్ద ఇరుజట్ల అభిమానులు తమ అభిమాన టీమ్ లను ప్లేర్లను పలుకుతూ హోరెత్తించారు. మొదట ఆర్సీబీ ఆర్సీబీ అంటూ బెంగళూరు ఫ్యాన్స్ నినాదాలు చేయగా.. ఆ తర్వాత చెన్నై ఫ్యాన్స్ సీఎస్కే సీఎస్కే.. అంటూ ఆ పరిసరాలను షేక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
RCB : బెంగళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు.. ఇక మ్యాచ్ అయితే.. !