SRH vs GT - Rashid Khan : నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2024 12వ మ్యాచ్ లో రషీద్ ఖాన్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. సూపర్ మ్యాన్ లా అద్భుతమైన క్యాచ్ తో ఐడెన్ మార్క్రమ్ పెవిలియన్ కు పంపాడు.
SRH vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐపీఎల్ 2024 12వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ తో సూపర్ మ్యాన్ షో చూపించాడు గుజరాత్ ప్లేయర్ రషీద్ ఖాన్. బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో నూ దుమ్మురేపాడు.
హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ను తన బౌలింగ్ లో పెవిలియన్ కు పంపాడు. అలాగే, ఐడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్ లను క్యాచ్ రూపంలో పట్టుకుని క్రీజును వీడేలా చేశాడు రషీద్ ఖాన్. క్లాసెన్ తన చివరి ఓవర్లో రెండు సిక్సర్లతో రషీద్ ఖాన్ బౌలింగ్ ను చిత్తుచేసిన తన ప్రయత్నం కొనసాగించాడు. అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. డెంజరస్ ప్లేయర్ క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.
తర్వాతి ఓవర్ లో రషీద్ తాను కేవలం స్పిన్ బౌలర్ మాత్రమే కాదని నిరూపించాడు. లాంగ్ ఆన్ లో నిలబడి, ఐడెన్ మార్క్రమ్ ఆడన షాట్ ను సూపర్ మ్యాన్ లా పరుగుతో ముందుకు దూకి క్యాచ్ పట్టాడు. ఈ మ్యాచ్ లో ఇది ఒక హైలెట్ అని చెప్పవచ్చు. దీంతో మార్క్రమ్ 19 బంతుల్లో 17 పరుగులు వద్ద ఔట్ అయ్యారు. ఇక చివరలో వాషింగ్టన్ సుందర్ ను క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపాడు. ఈ క్యాచ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బుల్లెట్ లాంటి బంతులు.. బ్యాటర్లకు దడ పుట్టించిన మయాంక్ యాదవ్..
