సారాంశం
R Praggnanandhaa: ప్రపంచ ఛాంపియన్, గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఆర్ ప్రజ్ఞానంద అధిగమించాడు. టాటా స్టీల్ మాస్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద భారత టాప్ ర్యాంక్ పురుషుల చెస్ ప్లేయర్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దేశంలో నెంబర్.1 చెస్ ప్లేయర్ గా నిలిచాడు.
India's No.1 chess player Praggnanandhaa: తమిళనాడు సంచనలం, గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద తన కెరీర్ లో తొలిసారి భారత పురుషుల చెస్ క్రీడాకారుడిగా అనుభవజ్ఞుడైన విశ్వనాథన్ ఆనంద్ ను అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. 18 ఏళ్ల సంచనలనం బ్లాక్ పీస్ తో ప్రస్తుత ఛాంపియన్ ను ఓడించి, లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ ను అధిగమించి భారత్ లో అగ్రస్థానంలో నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ అడుగుజాడల్లో నడుస్తూ 2023లో ప్రపంచ కప్ ఫైనల్ చేరిన అతి పిన్న వయస్కుడైన చెస్ క్రీడాకారుణిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. 2022లో చెన్నైకి చెందిన ఈ టీనేజర్ మాగ్నస్ కార్ల్ సన్ ను పలుమార్లు ఓడించి భారత పురోగతిని చాటిచెప్పి చెస్ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రజ్ఞానంద 2023 లో హాంగ్జౌ ఆసియా క్రీడలలో రజత పతకం సాధించాడు.
ఈ ఫలితంపై ప్రజ్ఞానంద ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. "నేను చాలా సులభంగా సమానమయ్యానని నేను భావించాను, ఆపై ఏదో విధంగా అతనికి విషయాలు తప్పుగా జరగడం ప్రారంభించాయి. నేను పాన్ గెలిచిన తర్వాత కూడా, అది నిలుపుకోవాలని నేను భావించాను. క్లాసికల్ చెస్ లో ప్రపంచ ఛాంపియన్ పై మొదటిసారి గెలవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది" అని అన్నాడు. 2018 లో, ప్రజ్ఞానంద 12 సంవత్సరాల వయస్సులో భారతదేశ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్, ప్రపంచంలో రెండవ పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించాడు. అలాగే, అతని అక్క ఆర్ వైశాలి కూడా గ్రాండ్ మాస్టర్ కావడంతో ప్రపంచంలోనే తొలి అన్నచెల్లెల్లుగా చరిత్ర సృష్టించారు.
Yuvraj Singh: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !
భారత చెస్ క్రీడాకారుల్లో ప్రజ్ఞానంద నెంబర్ ప్లేస్ లోకి రావడంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసలు కురిపించారు. అదానీ గ్రూప్ ప్రజ్ఞానందకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని గౌతమ్ ఆదాని పేర్కొర్కొన్నాడు. క్రీడలో అతను సాధించిన గణనీయమైన పురోగతి భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించి అత్యున్నత స్థాయిలో పతకాలు సాధించడం కంటే గొప్పది మరొకటి లేదనీ, ఈ ప్రయాణంలో అథ్లెట్లకు మద్దతు ఇవ్వడానికి అదానీ గ్రూప్ మనస్ఫూర్తిగా అంకితమైందన్నారు.
16 సిక్సర్లు, 5 ఫోర్లు.. రికార్డు సెంచరీతో పాక్ బౌలర్లను ఉతికిపారేసిన ఫిన్ అలెన్..