సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  భారత క్రికెట్ జట్టు సభ్యులను ఓదార్చారు. అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తర్వాత  భారత జట్టు సభ్యుల్లో  ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.


న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  భారత క్రికెట్ జట్టు సభ్యులను ఓదార్చారు.  ఈ నెల  19వ తేదీన  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో  అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత  డ్రెస్సింగ్ రూమ్ లో భారత జట్టు సభ్యులతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు.

also read:Ind Vs Aus T20I: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా భారత జట్టు ప్రకటన

 భారత జట్టుకు చెందిన ఆటగాళ్లు ప్రతి ఒక్కరితో ఆయన  మాట్లాడారు. భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

ప్రపంచకప్ పోటీల్లో  భారత క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ మినహా అన్ని మ్యాచుల్లో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధిస్తే కప్ భారత్ కు దక్కేది. అయితే  అస్ట్రేలియా జట్టు వ్యూహంలో భారత్ జట్టు చిత్తయింది.

also read:mohammed shami... భారత ఆటగాళ్లకు మోడీ ఓదార్పు: సోషల్ మీడియాలో పంచుకున్న మహమ్మద్ షమీ

ఈ దఫా భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ను సాధిస్తుందని క్రికెట్ అభిమానులు ఎదురు చూశారు. అయితే  ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో  అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.

ప్రపంచకప్ పోటీల్లో  భారత క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ మినహా అన్ని మ్యాచుల్లో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధిస్తే కప్ భారత్ కు దక్కేది. అయితే  అస్ట్రేలియా జట్టు వ్యూహంలో భారత్ జట్టు చిత్తయింది.

రెండు దఫాలు ప్రపంచకప్ ను భారత జట్టు దక్కించుకుంది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ ను సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ దఫా ప్రపంచకప్ దక్కించుకుంటుందని  అంతా భావించారు. అయితే  ఫైనల్ మ్యాచ్ లో భారత ఓటమితో  మూడో దఫా కప్ అందకుండా పోయింది. అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని క్రీడా పండితులు  అభిప్రాయపడుతున్నారు. ఇంకా  30 నుండి  40 పరుగులు చేస్తే  అస్ట్రేలియా జట్టుపై ఒత్తిడి ఉండేదని అభిప్రాయంతో ఉన్నారు.