Asianet News TeluguAsianet News Telugu

నరేంద్ర మోడీ, సచిన్ ఇస్లాంలోకి మారాలని కోరుకున్న పాక్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్: సోషల్ మీడియాలో వైరలైన ఆడియో

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్  సయీద్ అన్వర్ వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

Pray PM Modi, Sachin Tendulkar embrace Islam: Saeed Anwar's shocking audio recording resurfaces (LISTEN) lns
Author
First Published Nov 17, 2023, 4:37 PM IST

న్యూఢిల్లీ:భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మౌలానా బోధనల ద్వారా ప్రేరణ పొందాడని  పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,  మాజీ పీసీబీ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్  పేర్కొన్న వీడియో  బయటకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత  సయీద్ అన్వర్ కు సంబంధించిన ఆడియో  సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. 2021 మార్చి లో యూట్యూబ్ లో తొలిసారిగా  యూట్యూబ్ లో  ఈ  వీడియో పోస్టు చేశారు.  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్  సహా ముస్లిమేతరు ఇస్లాంను స్వీకరించాలని  పాకిస్తాన్ మాజీ క్రికెటర్ పిలుపునిచ్చారు.

ముస్లిమేతరుల కోసం ప్రార్థించండి, ఇస్లాం స్వీకరిచడానికి అల్లా వారికి మార్గనిర్ధేశం చేస్తాడని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇస్లాం స్వీకరించేలా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మార్గనిర్ధేశం చేయాలని తాను అల్లాను ప్రార్థిస్తున్నట్టుగా  ఆ సందేశం ఉంది.  సచిన్ టెండూల్కర్,  బ్రియాన్ లారా తనకు తెలిసిన ముస్లిమేతరులందరిని ఇస్లాంలోకి మార్చమని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ పేద ఆత్మలు ఇస్లాంను ఎందుకు స్వీకరించరని  సయీద్ అన్వర్ ఆరోపించిన  ఆడియో  సోషల్ మీడియా ఎక్స్ లో  వైరల్ గా మారింది.

 మౌలానా తారిఖ్ జమీల్ బోధనల నుండి హర్బజన్ సింగ్ ఎలా ప్రేరణ పొందాడని పేర్కొంటూ ఇంజమామ్ ఉల్ హక్ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ విషయమై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన కొన్ని రోజులకే సయీద్ అన్వర్  ఆడియో  ఎక్స్ లో  చక్కర్లు కొడుతుంది.

తాము నమాజ్ చేసే గదికి ఇండియా క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ లను ప్రార్థనకు ఆహ్వానించాము. అయితే  ప్రార్థనలు చేయకపోయినా మౌలానా తారిఖ్ జమీత్ చెప్పేది వాళ్లు  వినేవాళ్లని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ సెలెక్టర్  చెప్పారు.

 

 ఒకరోజు హర్భజన్ సింగ్ మౌలానా మాటలు వినమని తన హృదయం చెబుతుందని చెప్పాడని  ఇంజామామ్ ఉల్ హక్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వైరల్ వీడియోపై  భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు హర్భజన్ సింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.  తాను గర్వించదగిన భారతీయుడినని చెప్పారు. అంతేకాదు  గర్వించదగిన సిక్కును కూడ అని ఆయన  పేర్కొన్నారు.  ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్న అంశాలను  హర్భజన్ సింగ్ కొట్టి పారేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios