PM Narendra Modi Meets Sri Lanka's 1996 World Cup-Winning Team: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంకలో చారిత్రాత్మక పర్యటనలో 'మిత్ర విభూషణ' అవార్డు దక్కింది. ఈ పర్యటనలో శ్రీలంక క్రికెట్ దిగ్గజాలను కూడా కలిశారు. పీఎంపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. 

PM Narendra Modi Meets Sri Lanka's 1996 World Cup-Winning Team: శ్రీలంకలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ 1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ టీమ్‌తో శనివారం భేటీ అయ్యారు. క్రికెట్ దిగ్గజాలు పీఎం మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు శ్రీలంక తన అత్యున్నత పౌర పురస్కారమైన మిత్ర విభూషణతో సత్కరించింది. ఈ గౌరవాన్ని కేవలం విదేశీ దేశాధినేతలకు మాత్రమే ఇస్తారు.  పీఎం మోడీని కలిసిన వారిలో మార్వన్ అటపట్టు, అరవింద డిసిల్వా, చమిందా వాస్, సనత్ జయసూర్య, కుమార్ ధర్మసేన వంటి ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు.

పీఎం మోడీ ఈ మీటింగ్ ఫోటోలను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేస్తూ.. 1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక క్రికెటర్లను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ట్రోఫీ గెలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్ అభిమానుల కలను నిజం చేసింది అని రాశారు.

 

Scroll to load tweet…

 

పీఎం మోదీని కలిసిన తర్వాత శ్రీలంక దిగ్గజ క్రికెటర్లు ఏమన్నారంటే?

ఈ మీటింగ్ ఒక కలగా నిజమైనట్టు ఉందని మార్వన్ అటపట్టు చెప్పారు. అలాగే, ఈ మీటింగ్ చాలా అద్భుతంగా ఉంది తెలిపారు.

 

Scroll to load tweet…

 

కుమార్ ధర్మసేన మాట్లాడుతూ.. పొరుగు దేశమైన శ్రీలంకకు సహాయం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ఇలాంటి నాయకుడిని నేను మొదటిసారి చూశాను. భారత్ మాకు సపోర్ట్ చేస్తోంది అన్నారు.

 

Scroll to load tweet…

 

అరవింద డిసిల్వా మాట్లాడుతూ.. మూడోసారి ప్రధాని కావడం గొప్ప విషయం. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా గౌరవం ఉంది అన్నారు.

 

Scroll to load tweet…

 

మేము ఆటల గురించి మాట్లాడామనీ, 1996లో మేము (శ్రీలంక) ఎలా ప్రపంచ కప్ గెలిచామో చమిందా వాస్ చెప్పారు. ఆయనకు క్రికెట్ గురించి చాలా బాగా తెలుసు అన్నారు.

 

Scroll to load tweet…

 

భారత్‌ను అభివృద్ధి చేయాలనే ఆయన ఆలోచన చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని సనత్ జయసూర్య అన్నారు. భారతదేశాన్ని ఒక దేశంగా ఎలా అభివృద్ధి చేశారో ఆయన చాలా బాగా వివరించారు అన్నారు.

 

Scroll to load tweet…

 

కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో ప్రధాని మోడీకి ప్రత్యేక స్వాగతం లభించింది. ఆ తర్వాత అధ్యక్షుడు అనురా కుమార్ దిసానాయకే ఆయనను 'మిత్ర విభూషణ' అవార్డుతో సత్కరించారు.