ఇదేందయ్యా ఇది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న‌ అంపైర్.. ఆగిన మ్యాచ్ !

Australia vs Pakistan Test: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ బాక్సింగ్ డే టెస్టు లో విచిత్ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. మొద‌ట వ‌ర్షం, ఆ త‌ర్వాత పావురాలతో మ్యాచ్ కొద్ది సేపు ఆగింది. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు ఒక లిఫ్ట్ మ్యాచ్ ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం అయింది. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జ‌రిగింది.
 

Play delayed due to third umpire Richard Illingworth stuck in lift at MCG, Australia vs Pakistan Test

Richard Illingworth: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ బాక్సింగ్ డే టెస్టును ఆడుతున్నాయి. మెల్ బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో అనూహ్య ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూ మ్యాచ్ కు అంత‌రాయం క‌లిగిస్తున్నాయి. బాక్సింగ్ డే టెస్టు మొద‌టి రోజు ఆట ప్రారంభం రోజున వర్షం ప‌డ‌టంతో మ్యాచ్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఆ తర్వాత పావురాల వల్ల మ్యాచ్ కొద్ది స‌మ‌యం ఆగిపోయింది. ప్లేయ‌ర్లు అంతా క‌లిసి పావురాల‌ను గ్రౌండ్ నుంచి వెళ్ల‌గొట్టారు. ఇక తాజాగా మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో మ్యాచ్ కొద్ది సేపు ఆగిపోయింది.

ఇదే అంశం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మీమ్స్, ట్రోల్స్ తో సోష‌ల్ మీడియా హోరెత్తుతోంది. ఇదెక్క‌డి ద‌రిద్రంరా బాబు అంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. గతంలో తేనెటీగల నుండి కాల్చిన టోస్ట్, గ్రేవీ వరకు, దశాబ్దాలుగా ఆట ఆల‌స్యానికి కొన్ని అసాధారణ కారణాలుగా ఉన్నాయి. ఇదే త‌ర‌హాలో మెల్ బోర్న్ లో కూడా చోటుచేసుకుంది. బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు రెండో సెషన్ ను తిరిగి ప్రారంభించేందుకు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆటగాళ్లు సిద్ధమవుతుండగా, ఆన్ ఫీల్డ్ అంపైర్లు జోయెల్ విల్సన్, మైఖేల్ గౌగ్లు గ్రౌండ్ లోకి వ‌చ్చినా మ్యాచ్ ప్రారంభానికి అనుమతి ఇవ్వలేదు. కాసేపు అందరూ ఏం జ‌రుగుతోంద‌నుకున్నారు. కానీ అస‌లు విష‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్ వర్త్ డైనింగ్ హాల్ నుంచి తిరిగి వస్తుండగా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయ‌న రాక ఆల‌స్యం కావ‌డంతో కాసేపు మ్యాచ్ ఆల‌స్యం అయింది.

 

ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్ లో 318 ప‌రుగులకు ఆలౌట్ అయింది. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 264 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలింది. 16 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (26*), మిచెల్ మార్ష్ (61*) నిల‌క‌డ‌గా ఆడుతున్నారు.

INDW VS AUSW: ఆస్ట్రేలియా తొలి వన్డే.. జోరును కొనసాగించడానికి సిద్ధమైన భారత్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios