PKL 10 Final: ప్రో కబడ్డీ లీగ్ 2024 సీజన్ 10 ఛాంపియన్ గా పుణెరి పల్టాన్..
Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ లీగ్ 2024 సీజన్ 10 లీగ్ దశల్లో 96 పాయింట్లతో ఆధిపత్యం చెలాయించిన పుణెరి పల్టాన్ ఫైనల్లోనూ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగించింది. హర్యానా స్టీలర్స్ ను మట్టికరిపించి పీకేఎల్ సీజన్ 10 ఛాంపియన్ గా పుణెరి పల్టన్ నిలిచింది.
Pro Kabaddi League 2024 : ప్రో కబడ్డీ లీగ్ 2024 లో కొత్త ఛాంపియన్ అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో హర్యానా స్టీలర్స్‌పై పుణెరి పల్టన్ అద్భుత విజయంతో తమ మొట్టమొదటి టైటిల్‌ను సొంతం చేసుకుని కొత్త ఛాంపియన్ గా అవతరించింది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో హర్యానాపై 28-25తో పుణెరి పల్టన్ చారిత్రాత్మక విజయం సాధించడంలో పంకజ్ మోహితే, మోహిత్ గోయత్ కీలక పాత్ర పోషించింది.
పీకేఎల్ 10 లీగ్ దశల్లో 96 పాయింట్లతో ఆధిపత్యం చెలాయించిన పుణెరి పల్టన్ ఫైనల్‌లోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. పంకజ్ మోహితే ఐదు ప్రారంభ పాయింట్లను సాధించడం దూకుడు ప్రదర్శించాడు. మొదటి అర్ధభాగంలో పూణేకు 13-10 స్వల్ప ఆధిక్యాన్ని అందించాడు. ద్వితీయార్ధంలో మరో నాలుగు పాయింట్లను అందించాడు. సంకేత్ సావంత్ టాకిల్‌తో పుణెరి పల్టాన్స్ ఆధిక్యంలోకి వెళ్లగా, పంకజ్ 4 పాయింట్ల రైడ్‌తో ఆకట్టుకున్నాడు. అత్యద్భుతమైన బ్లాక్‌లు, టాకిల్స్‌తో రెండు జట్లు అసాధారణమైన రక్షణ నైపుణ్యాలను ప్రదర్శించాయి. మొదటి అర్ధభాగంలో మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని హర్యానా ఆలస్యంగా పునరాగమనం చేసినప్పటికీ, పూణే తన ఆధిక్యాన్ని కొనసాగించగలిగింది.
టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన టాప్-5 భారత క్రికెటర్లు వీరే !
రెండో అర్ధభాగంలో హర్యానా బలమైన ప్రదర్శన చేసి, మరిన్ని రైడ్ పాయింట్లను దక్కించుకుంది, అయితే పుణె రెండు ఆల్ అవుట్లు, నాలుగు ట్యాకిల్ పాయింట్లతో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఛాంపియన్ గా నిలిచింది. పంకజ్ 9 పాయింట్లతో పూణే తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలవగా, ఫైనల్‌లో శివమ్ పటారే ఆరు పాయింట్లతో హర్యానా తరఫున టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. పూణేకు చెందిన ఇరానియన్ ఆల్ రౌండర్, మహ్మద్రెజా చియానెహ్ షాద్లౌయ్, ఈ సీజన్‌లో బెస్ట్ డిఫెండర్ అవార్డును అందుకోగా, అస్లాం ఇనామ్‌దార్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీకి చెందిన అషు మాలిక్‌కు బెస్ట్ రైడర్ టైటిల్ లభించగా, టోర్నమెంట్ పదో ఎడిషన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు యోగేష్ దహియా బెస్ట్ న్యూ యంగ్ ప్లేయర్ గా అవార్డును అందుకున్నాడు.
సచిన్-ధోనీ-విరాట్ కంటే ఖరీదైన ఇల్లు.. ఈ భారత క్రికెట్ క్వీన్ ఎవరో తెలుసా?
టెస్టు క్రికెట్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే !