MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • స‌చిన్-ధోనీ-విరాట్ కంటే ఖరీదైన ఇల్లు.. ఈ భార‌త‌ క్రికెట్ క్వీన్ ఎవ‌రో తెలుసా?

స‌చిన్-ధోనీ-విరాట్ కంటే ఖరీదైన ఇల్లు.. ఈ భార‌త‌ క్రికెట్ క్వీన్ ఎవ‌రో తెలుసా?

Mridula Jadeja : అత్యంత ఖ‌రీదైన ఇంట్లో నివాస‌ముంటున్న భార‌త క్రికెట‌ర్ల‌లో స‌చిన్ టెండూల్క‌ర్, విరాట్ కోహ్లీ, రోమిత్ శ‌ర్మ‌, ఎంఎస్ ధోనిలు ముందు క‌నిపిస్తుంటారు. కానీ, వీరింద‌రి కంటే వేల కోట్ల విలువైన ఇంట్లో నివాస‌ముంటున్నారు ఒక క్రికెట‌ర్. ఆమె భార‌త క్రికెట్ క్వీన్ మృదుల జడేజా ! 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 01 2024, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Indian cricketer, mridula jadeja, mridula ,

Indian cricketer, mridula jadeja, mridula ,

Top 10 expensive houses of Indian cricketers: భార‌త క్రికెట‌ర్ల‌లో అత్యంత ఖ‌రీదైన ఇల్లు ఎవ‌రికి వుంద‌నే ప్ర‌స్తావ‌న వ‌స్తే సాధార‌ణంగా వినిపించే ప్లేరు స‌చిన్ టెండూల్క‌ర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ.  ఈ స్టార్ ప్లేయ‌ర్లు దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే ఇంట్లో నివాస‌ముంటున్నారు. అయితే, వీరిని మించి అత్యంత ఖ‌రీదైన ఇంట్లో నివాస‌ముంటున్నారు ఒక భార‌త క్రికెటర్.. ఆమె టీమిండియా క్రికెట్ క్వీన్ మృదుల జ‌డేజా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మృదుల జడేజా ఒక భారతీయ మ‌హిళా క్రికెటర్. ఆమె 2006 నుండి గుజరాత్ సౌరాష్ట్ర జట్టు కోసం క్రికెట్ ఆడుతోంది. ఆల్ రౌండర్ గా త‌న‌కుంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

39
Mridula Jadeja

Mridula Jadeja

నిజానికి మృదుల రాజ్‌కోట్ యువరాణి అని చెప్పాలి. మృదులా జడేజా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్నారు. అతని తండ్రి మంధాత సింగ్ రాజ్‌కోట్‌కు చెందిన రాజ‌ వంశీయుడు. ఆయ‌న కుమార్తె మృదుల జ‌డేజా. 

49
mridula jadeja

mridula jadeja

మృదులకు.. జాడేజాకు అంటే టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు సంబంధీకులు అనుకునేరు. జ‌డ్డూ భాయ్ తో మృదుల జ‌డేజాకు ఎలాంటి సంబంధ‌మూ లేదు. ఆమె స‌చిన్, ధోని, విరాట్ కోహ్లీ కంటే ఖ‌రీదైన ఇంట్లో నివాస‌ముంటున్నారు. 

59
Mridula Jadeja

Mridula Jadeja

భార‌త లెజెండ‌రీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటి విలువ 100 కోట్లు. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సచిన్ టెండూల్కర్,  విరాట్ కోహ్లీ దాదాపు రూ. 80 కోట్ల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, వీరిని మించి మృదుల అత్యంత ఖ‌రీదైన ఇంట్లో నివాస‌ముంటున్నారు. మృదుల నివాస‌ముంటున్న త‌మ‌ పూర్వీకుల భవనం రూ. 4000 కోట్ల కంటే ఎక్కువ ఖ‌రీదైన‌ది. 

69
mridula jadeja

mridula jadeja

మృదుల రాజ్‌కోట్‌లోని రంజిత్ విలాస్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. 225 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఇంట్లో 100 కంటే ఎక్కువ గదులు ఉన్నాయి. ఈ రాజుల నివాస‌మున్న ప్యాలెస్ 100 సంవత్సరాలకు పైగా పురాత‌న‌మైన‌ది కావ‌డం విశేషం.

79
mridula jadeja

mridula jadeja

మృదులా జడేజా నివాస‌ముంటున్న ఈ రాజ భవనాన్ని ఠాకూర్ సాహెబ్ బావ్జీ రాజ్ 1870లో నిర్మించారు, ఇందులో అందమైన శిల్పాలు, ఇటాలియన్ స్తంభాలు, అద్భుత‌మైన క‌ళ‌తో కూడిన గొప్ప‌ దేవాలయాలు, అనేక పాతకాలపు కార్లు, ఇత‌ర వాహ‌నాలు ఉన్నాయి.

89
mridula jadeja

mridula jadeja

మృదులా జడేజా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. రైట్-మీడియం బౌలర్. సౌరాష్ట్ర జట్టు తరఫున 36 టీ20 మ్యాచ్ లు, 46 లిస్టే ఏ వ‌న్డే మ్యాచ్ ల‌ను ఆడారు. ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు సాధించారు. 

 

99
Mridula Kumari Jadeja

Mridula Kumari Jadeja

క్రికెట్ క్వీన్ మృదులా జ‌డేజా 17 సంవత్సరాల వయస్సు నుండి ఆల్ రౌండర్‌గా సౌరాష్ట్ర తరపున క్రికెట్ ఆడుతున్నారు. ఆమె వెస్ట్ జోన్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2021లో మహిళల సీనియర్ వ‌న్డే క్రికెట్ ట్రోఫీలో ఆమె నాలుగు అర్ధ సెంచరీలు సాధించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved