టెస్టు క్రికెట్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే !
Top-5 Indian bowlers: అంతర్జాతీయ క్రికెట్ కు భారత్ అద్భుతమైన ప్లేయర్లను అందించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతాలు చేసిన భారత ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ లు సమంగా నిలిచాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ల జాబితా ఇలా ఉంది..
Ravichandran Ashwin, anil kumble
రవిచంద్రన్ అశ్విన్ :
భారత స్టార్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అశ్విన్ ఇప్పటివరకు తన టెస్టు క్రికెట్ కెరీర్ లో 35 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక 5 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా అనిల్ కుంబ్లేను సమం చేశాడు. దీని కోసం 187 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
Ashwin
అనిల్ కుంబ్లే :
భారత టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే. ఒంటిచేత్తో అనేక మ్యాచ్ లను గెలిపించారు. అనిల్ కుంబ్లే టెస్టుల్లో 35 సార్లు ఐదు వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు.
Harbhajan Singh
హర్భజన్ సింగ్ :
అశ్విన్ కంటే ముందు భారత అత్యుత్తమ ఆఫ్ స్పినీర్, హర్భజన్ సింగ్ 103 మ్యాచ్‌లలో (190 ఇన్నింగ్స్‌లు) 25 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
కపిల్ దేవ్ :
భారతదేశపు గొప్ప ఆల్ రౌండర్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ ఒకప్పుడు అత్యధిక ఐదు వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. కపిల్ తన టెస్టు కెరీర్ లో 23 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. 131 మ్యాచ్‌లలో (227 ఇన్నింగ్స్) దీనిని సాధించాడు.
బీఎస్ చంద్రశేఖర్
భారతదేశ ప్రసిద్ధ స్పిన్-బౌలింగ్ క్వార్టెట్‌లో బీఎస్ చంద్రశేఖర్ ఒకరు. ఆయన తన కెరీర్ లో 58 మ్యాచ్‌లలో 16 సార్లు 5 వికెట్లు తీసుకున్నారు. 97 ఇన్నింగ్స్‌లలో దీనిని సాధించాడు.