కోల్ కతా: భారత్ తన తొలి డే నైట్ పింక్ బాల్ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. కేవలం మూడవరోజే ఆటను ముగించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్ల ధాటికి, భారత్ రెండో ఇన్నింగ్స్ కూడా ఆదానవసరం లేకుండా పోయింది. 

Also read: బంగ్లా క్రికెటర్ కి టీమిండియా ఫిజియో సాయం...ట్విట్టర్ లో ప్రశంసలు

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ ను భారత్ 106 పరుగులకు అల్ అవుట్ చేసింది. ఆ తరువాత బాటింగ్ కు దిగిన భారత జట్టు కోహ్లీ సెంచరీ, రహానే అర్థ శతకంతో 347/9 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆట ప్రారంభించిన బాంగ్లాదేశ్ ను భారత బౌలర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. బంగ్లా బ్యాట్స్ మెన్ లో మహ్మదుల్లా, ముషఫికర్ రహీమ్ లు భారత్ బౌలర్లపై ఒకింత ఎదురుదాడికి దిగినా అది వృధా ప్రయాసే అయ్యింది. 

భారత బౌలర్లు నేడు మ్యాచ్ ప్రారంభమైన గంటలోపే ఆటను ముగించేశారు. పది ఓవర్లలోపే మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టి విజయ తీరాలకు భారత టీం ను చేర్చారు. 

నిన్న ఆట ముగిసే సమయానికి,టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. శనివారం రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నిన్న ఆట కాసేపట్లో ముగుస్తుందనగా బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ఆరో వికెట్‌గా తైజుల్‌ ఇస్లామ్‌(11) ఔటైన తర్వాత రెండో రోజు ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. 

Also read: పింక్ బాల్ టెస్ట్.... విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్

నేడు ఆట ప్రారంభమయ్యే సమయానికి బాంగ్లాదేశ్ 89 పరుగులు వెనుకబడి ఉండటంతో, భారత్‌ దాదాపుగా మరో ఇన్నింగ్స్‌ విజయం ఖాయమని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే భారత్ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 

నిన్న రాత్రి ఆట ముగిసే సమయానికి ముష్పికర్‌ ఒంటరి పోరాటం చేస్తూ క్రీజులో ఉన్నాడు. అతని ఒంటరిపోరు ఎక్కువసేపు నిలవలేదు. ఎనిమిదవ వికెట్ గా వెనుదిరిగాడు. 

మహ్మదుల్లా, మెహిదీ హసన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన ముష్పికర్‌ నిన్న హాఫ్‌ సెంచరీ సాధించాడు. భారత్‌పై మంచి రికార్డును లాస్ట్ మ్యాచులో కూడా ప్రదర్శించిన ముష్పికర్‌ అదే ఆటను ఈ ఇన్నింగ్స్ లోనూ కొనసాగించాడు. కాకపోతే అతనికి మిగతా వారి నుంచి ఆశించిన సహకారం లభించలేదు.  

ముష్పికర్‌-మహ్మదుల్లాలు క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో బంగ్లాకు షాక్‌ తగిలింది. మహ్మదుల్లా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్ట్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ హామ్ స్ట్రింగ్ ఇంజురీ వల్ల ఈ రోజు అతడు గ్రౌండ్ లోకే రాలేదు.