Asianet News TeluguAsianet News Telugu

బంగ్లా క్రికెటర్ కి టీమిండియా ఫిజియో సాయం...ట్విట్టర్ లో ప్రశంసలు

మైదానంలో నయిమ్ పరిస్థితిని గమనించిన  విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ టీమ్ ఫిజియో కోసం పిలిచాడు. కానీ.. అతను లిట్టన్ దాస్‌కి ట్రీట్‌మెంట్ చేస్తుండటంతో అతను అందుబాటులో లేకపోయాడు. దీంతో.. బౌండరీ లైన్‌కి వెలుపలే ఉన్న భారత ఫిజియో నితిన్ పటేల్‌ని వేగంగా రమ్మని విరాట్ కోహ్లీ సైగ చేశాడు. 

Team India Physio Treats Bangladesh Batsman, Twitter Praises Noble Gesture
Author
Hyderabad, First Published Nov 23, 2019, 12:03 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్ క్రీడా స్ఫూర్తి గ్రేట్  అంటూ కొనియాడుతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రస్తుతం టీమిండియా కోల్ కతా వేదికగా... బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 20వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌన్సర్ బంతి ఆడబోయిన లిట్టన్ దాస్.. బంతి అందకపోవడంతో గాయపడ్డాడు. 

వేగంగా వచ్చిన బంతి నేరుగా వెళ్లి లిట్టన్ దాస్ హెల్మెట్‌కి బలంగా తాకడంతో అతను బ్యాటింగ్‌ని కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన నయిమ్ హసన్ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే బౌన్సర్‌ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి నయిమ్ చెవి భాగంలో హెల్మెట్‌కి తాకింది. దీంతో.. నయిమ్ అస్వస్థతకు గురయ్యాడు.

మైదానంలో నయిమ్ పరిస్థితిని గమనించిన  విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ టీమ్ ఫిజియో కోసం పిలిచాడు. కానీ.. అతను లిట్టన్ దాస్‌కి ట్రీట్‌మెంట్ చేస్తుండటంతో అతను అందుబాటులో లేకపోయాడు. దీంతో.. బౌండరీ లైన్‌కి వెలుపలే ఉన్న భారత ఫిజియో నితిన్ పటేల్‌ని వేగంగా రమ్మని విరాట్ కోహ్లీ సైగ చేశాడు. వెంటనే.. మైదానంలోకి వచ్చిన నితిన్.. నయిమ్‌కి ట్రీట్‌మెంట్‌ చేశాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. విరాట్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లా క్రికెటర్ కి సాయం అందించడానికి విరాట్ టీమిండియా ఫిజియోని పంపించడం గొప్ప విషయమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios