పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి, వారిపై ప్రేమను కురిపించాలని పిలుపునిచ్చారు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. న్యూఇయర్ సందర్భంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు. 2020లో పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టేందుకు కేటాయిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

పిల్లల ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సచిన్ అభిప్రాయపడ్డారు. పిల్లలకు ఆటలు మనోవికాసాన్ని అందిస్తాయని.. వారు ఆడుకునేందుకు సరైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సచిన్ తెలిపారు.

Also Read:ప్రియురాలితో హార్దిక్ న్యూఇయర్ సంబరాలు... నెటిజన్ల రెస్పాన్స్ ఇదే

ఆటలు చిన్నారులను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచడంతో పాటు వారిలో క్రీడాస్ఫూర్తిని కూడా పెంచుతుందని టెండూల్కర్ వెల్లడించారు. ఉత్సుకత, ఉత్సాహం పిల్లల నుంచి మనమందరం నేర్చుకోగల రెండు లక్షణాలని పెద్దలకు గుర్తుచేశారు.

మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి, మనం చేసే పనులన్నింటిలో నిమగ్నమవ్వడానికి ఇవి చాలా అవసరమని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో దివ్యాంగుడైన ఓ చిన్నారి మద్దా రామ్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు.

Also Read:బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు అనుష్కకే... కితాబు ఇచ్చిన కోహ్లీ

రెండుకాళ్లూ పనిచేయకున్నా ఆ చిన్నారి పాకుతూ పరుగు తీసి స్ఫూర్తి నింపాడన్నారు. ఈ సన్నివేశం తన హృదయాన్ని ద్రవింపజేసిందని సచిన్ పేర్కొన్నారు. కొత్త ఏడాదిని ఆరంభించేందుకు ఇంతకన్నా స్ఫూర్తిమంతమైన వీడియో ఇంకేం ఉంటుందని టెండూల్కర్ అభివర్ణించాడు.