టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ... తన భార్య అనుష్క శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డ్... తన భార్య అనుష్క శర్మకు దక్కుతుందని విరాట్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆయన తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు.

దానికి క్యాప్షన్ గా అత్యత్తుమ ఫోటోగ్రాఫర్ మీ దగ్గరే ఉంటే మంచి చిత్రాలు తీసుకోవడంపై బెంగ ఉండదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటో తీసింది ఆయన భార్య అనుష్క శర్మ అట. ఈ విషయాన్నిఈ సందర్భంగా కోహ్లీ వివరించాడు. స

అనుష్క తన ఫోటోలను అద్భుతంగా తీస్తుందని.. అందుకే తాను బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డ్ తనకు ఇస్తున్నానంటూ చెప్పడం గమనార్హం. తాజాగా అనుష్క తీసిన ఫోటోని కూడా కోహ్లీ అభిమానులతో షేర్ చేశాడు. ఆ ఫోటోకి నెటిజన్ల నుంచి స్పందన కూడా బాగా వస్తోంది. ఇదిలా ఉండగా... ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ కపుల్ స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటున్నారు.