Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలితో హార్దిక్ న్యూఇయర్ సంబరాలు... నెటిజన్ల రెస్పాన్స్ ఇదే

హార్దిక్ పోస్టుకి నెటిజన్లు బాగా స్పందించారు. కాంగ్రాంట్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. జంట బాగున్నారంటూ మెచ్చుకుంటున్నారు. పాండ్యా ఇది పోస్టు కాసేపటికే, పాండ్యా మరదలు పంఖురి శర్మ మొదటగా స్పందించారు. 
 

Hardik Pandya Starts New Year With "Firework", Fans Pour In Love
Author
Hyderabad, First Published Jan 1, 2020, 1:37 PM IST

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త సంవత్సర సంబరాల్లో మునిగితేలుతున్నాడు. తన ప్రియురాలితో కలిసి సంబరాలు చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో హార్దిక్.... ఓ యువతితో డేట్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా... ఆ వార్తలకు పులిస్టాప్ పెడుతూ..తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. నటాసా స్టాంకోవిక్‌తో తనకున్న సంబంధాన్ని బయటపెట్టాడు. గత కొంత కాలంగా హార్దిక్, నటాసాల డేటింగ్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటన్నింటిని నిజం చేస్తూ.. పాండ్యా నటాసాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. నేను నా కొత్త సంవత్సరాన్ని ఇలా ప్రారంభిస్తున్నానంటూ పాండ్యా ఫోటోతో పాటూ రాశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Starting the year with my firework ❣️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Dec 31, 2019 at 9:29am PST

 

కాగా... హార్దిక్ పోస్టుకి నెటిజన్లు బాగా స్పందించారు. కాంగ్రాంట్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. జంట బాగున్నారంటూ మెచ్చుకుంటున్నారు. పాండ్యా ఇది పోస్టు కాసేపటికే, పాండ్యా మరదలు పంఖురి శర్మ మొదటగా స్పందించారు. 

పాండ్యా వెన్నునొప్పి కారణంగా సెప్టెంబర్ 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే పాండ్యా ఆ నొప్పి నుంచి కోలుకుంటున్నాడు. పాండ్యా వచ్చే నెలలో ఇండియా ‘ఎ’తరపున న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ, శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు మరియు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలకు ఎంపిక కాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios