కరాచీ: న్యూజిలాండ్ పై చివరి టీ20 మ్యాచులో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. న్యూజిలాండ్ పై జరిగిన చివరి టీ20లో భారత్ విజయం సాధిస్తుందని తాను అనుకోలేదని అన్నాడు. 

తొలి 10 ఓవర్ల వరకు కూడా మ్యాచ్ కివీస్ చేతుల్లోనే ఉందని, ఆ తర్వాత భారత్ పుంజుకుందని షోయబ్ అన్నాడు. దీనికి కారణం జస్ప్రీత్ బుమ్రానే అని ఆయన అన్నాడు. ఆదివారం జరిగిన మ్యాచులో బుమ్రా నాలుగు బౌలింగ్ వేసి కేవలం 12 పరుగులే అచ్చాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. కీలకమైన సమయంలో మూడు వికెట్లు తీశాడు. 

Also Read: ఇండియా క్లీన్ స్వీప్ మూడోసారి: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా

ఆ విషయాన్ని షోయబ్ అక్తర్ ప్రధానంగా ప్రస్తావించాడు. భారత క్రికెట్ జట్టుకు బుమ్రా ఓ ఎక్స్ ఫ్యాక్టర్ అని ఆయన ప్రశంసించాడు. బుమ్రా తాను ఎంతటి నాణ్యమైన బౌలరునో అనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడని అన్నాడు.

బుమ్రా బౌలింగ్ అసాధారణని, 3 వికెట్లు.. 12 పరుగులు.. ఇదో అద్భుతమైన బౌలింగ్ అని షోయబ్ అక్తర్ అన్నాడు. టీమిండియా గెలవడానికి బుమ్రానే కారణమని అన్నాడు. గాయం తర్వాత గాడిలో పడడానికి బుమ్రా రెండు నుంచి మూడు మ్యాచులు మాత్రమే తీసుకున్నాడని గుర్తు చేశాడు.

Also Read: ఐదో టీ20: అదే ఉత్కంఠ.. కివీస్‌పై భారత్‌దే విజయం, సిరీస్ క్లీన్ స్వీప్

గాయాలైన తర్వాత చాలా మంది బౌలర్లు తమ రిథమ్ అందుకోవడానికి చాలా కాలం తీసుకుంటారని, కానీ బుమ్రా తొందరగా పూర్తి స్వింగ్ ను అందిపుచ్చుకున్నిాడని ఆయన అన్నాడు. బుమ్రా ఎప్పుడైనా డెత్ ఓవర్లలో 25 - 30 పరుగులకు మించి ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన అన్నాడు. సైనీ, శార్దూల్ మెరగైన బౌలింగ్ చేసినా టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రం బుమ్రానే అని షోయబ్ అక్తర్ అన్నాడు.