మౌంట్ మాంగనూయ్: న్యూజిలాండ్ పై జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీతో రికార్డులు సృష్చించాడు. 21 ఏళ్ల తర్వాత ఆసియా ఖండం వెలుపల జరిగిన వన్డేల్లో సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. 1999లో ఇంగ్లాండులో శ్రీలంకతో జరిగిన మ్యాచులో రాహుల్ ద్రావిడ్ సెంచరీ సాధించాడు. 

దాంతో పాటు కేఎల్ రాహుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐదు లేదా అ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించిన వికెట్ కీపర్ గా ధోనీ పేరిట ఉన్న ఉన్న రికార్డును చెరిపేశాడు. 2017లో కటక్ లో ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ఎంఎస్ ధోనీ 134 పరుగులు చేశాడు.

Also Read: టీ20 పరాజయానికి ఇండియాపై స్వీట్ రివెంజ్: వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్

భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్సుల్లో నాలుగు సెంచరీలు చేసిన రికార్డును కూడా రాహుల్ సొంతం చేసుకున్నాడు. శిఖర్ ధావన్ 24 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించాడు. దాన్ని రాహుల్ బద్దలు కొట్టాడు. రాహుల్ 31 ఇన్నింగ్సుల్లో నాలుగు సెంచరీలు చేశాడు. 

విరాట్ కోహ్లీ 36, గౌతం గంభీర్ 44, వీరేంద్ర సెహ్వాగ్ 50 ఇన్నింగ్సుల్లో నాలుగు సెంచరీలు సాధించారు. మంచి ఫామ్ లో ఉన్న రాహుల్ న్యూజిలాండ్ పై జరిగిన టీ20 సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో కూడా 88 పరుగులతో మెరిపించాడు.

Also Read: కివీస్ వర్సెస్ ఇండియా: శ్రేయస్ అయ్యర్ రికార్డు

అటు బ్యాటింగ్ లోనూ ఇటు వికెట్ కీపింగ్ లోనూ రాణిస్తున్న కేఎల్ రాహులన్ టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలతో ముంచెత్తాడు. తన క్లాస్ బ్యాటింగ్ తో మరో గొప్ప ఇన్నింగ్సు ఆడాడని ఆయన రాహుల్ ను కొనియాడాడు. 

రాహుల్ గత 11 ఇన్నింగ్సుల్లో 6 అర్థ సెంచరీలు చేశాడని, న్యూజిలాండ్ చివరి వన్డేలో సెంచరీ చేశాడని ఆయన అన్నారు. శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, మనీష్ పాండే మంచి సమన్వయంతో జట్టుకు మంచి స్కోరును సాధించి పెట్టారని ఆయన అన్నాడు.