హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం చేసుకున్న నటాషా స్టాన్ కోవిచ్ పై ఆమె మాజీ ప్రియుడు అలీ గోనీ స్పందించారు. మంగళవారంనాడు రింగ్ మార్చుకుని హార్దిక్ పాండ్యా, నటాషా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. దాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. 

తన మెరుపుతీగతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నానని అంటూ హార్డిక్ పాండ్యా ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలు పోస్టు చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై నటాషా మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలీ గోని స్పందించాడు. తొలుతు వారిద్దరికీ హార్ట్ సింబల్ (ఎమోజీ)ని బహుమతిగా పోస్టు ేచశాడు. అక్కడ ఏ విధమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయలేదు. 

Also Read: నటాషాతో ఎంగేజ్ మెంట్.... హార్దిక్ మాజీ ప్రేయసి స్పందన ఇదే

అయితే, వారు నిశ్చితార్థం చేసుకున్న ఒక రోజు తర్వాత అలీ గోనీ మీడియాతో మాట్లాడాడు. బాలీవుడ్ లైఫ్ కు ఇంటర్వ్యూ ఇస్తూ... వారికి అభినందలు తెలుపుతూ వారు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాడు. వారిద్దరు ఒక్కటి కావడాన్ని తాను ఇష్టపడుతున్నట్లు ఆయన తెలిపారు.

వారిద్దరినీ కలిసి ఉండడాన్ని తాను చూశానని, వారు వివాహం చేసుకోవడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని గోలీ చెప్పాడు. గోనీ, నటాషా నాచ్ బాలియే 9 అనే టీవీ షోలో దంపతులుగా కనిపించారు. నిశ్చితార్థంపై తాను కొంత ఆశ్చర్యపడిన మాట నిజమేనని గోనీ అన్నాడు. 

Also Read: నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్

వారిద్దరు డేటింగ్ చేస్తున్న విషయం తనకు తెలుసునని, ఇది ప్రతి ఒక్కరికీ కొంత ఆశ్చర్యకరమైన విషయమేనని, ామె ఆనందంగా ఉన్నందుకు తనకు సంతోషంగా ఉందని అన్నాడు.

నటాషా స్టాన్ కోవిచ్  బిగ్ బాస్ రియాల్టీ షోలో పాలు పంచుకుంది. పాపులర్ మ్యూజిక్ బాద్షా మ్యూజిక్ వీడియో బందూక్ లో కూడా నటించింది. బాలీవుడ్ సినిమాల్లో కొన్ని డ్యాన్స్ దృశ్యాల్లో కూడా కనిపించింది.