Asianet News TeluguAsianet News Telugu

నటాషాతో ఎంగేజ్ మెంట్.... హార్దిక్ మాజీ ప్రేయసి స్పందన ఇదే..

నూతన సంవత్సరం రోజున అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య హార్దిక్, నటాషాలు తమ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ‘ నువ్వు నా సొంతం.. నేను నీ సొంతం.. ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలుసు’ అనే క్యాప్షన్ తో తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని హార్దిక్ రివీల్ చేశాడు.

Hardik Pandya's ex Urvashi Rautela REACTS to his engagement with Natasa Stankovic
Author
Hyderabad, First Published Jan 3, 2020, 2:55 PM IST

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ నటాషాను ప్రేమించిన హార్దిక్... తాజాగా ఆమెతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతది తెలిసిందే. అయితే... నటాషాకి ముందు హార్దిక్ మరో బాలీవుడ్ బామతో కూడా ప్రేమాయణం నడిపాడు. ఆమె తో ప్రేమ మధ్యలోనే బ్రేక్ అవ్వగా... ఆ తర్వాత నటాషాతో ప్రేమలో పడ్డాడు.

కాగా... వీరి ఎంగేజ్ మెంట్ పై హార్దిక్ మాజీ ప్రేయసి ఊర్వశి రౌతెలా స్పందించారు. దాదాపు నెటిజన్లంతా కూడా వీరి ఎంగేజ్ మెంట్ విషయంపై ఆమె ఎలా స్పందిస్తుందా అనే చూశారు. ఒకవేళ ఆమె స్పందిచకపోయినా.. మీడియా ప్రతినిధులైనా ఆమెను ఈ విషయం గురించి కచ్చితంగా ప్రశ్నించేవారు.

అయితే... వాళ్లందరికీ ఛాన్స్ ఇవ్వకుండా... ఆమె వీరి ఎంగేజ్ మెంట్ విషయంలో హుందాగా ప్రవర్తించింది. ఇద్దరికీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేసింది. ‘ ఎంగేజ్ మెంట్ చేసుకున్నందుకు అభినందనలు. మీ బంధం  చిరకాలం ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇదిలా ఉండగా... నూతన సంవత్సరం రోజున అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య హార్దిక్, నటాషాలు తమ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ‘ నువ్వు నా సొంతం.. నేను నీ సొంతం.. ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలుసు’ అనే క్యాప్షన్ తో తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని హార్దిక్ రివీల్ చేశాడు.

AlsoRead నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్...

అయితే.. వీరి జంటను చాలా మంది ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. వారిద్దరి రంగులు భిన్నంగా ఉన్నాయని.. నటాషా తెల్లగా ఉండగా... హార్దిక్ నల్లగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. నీకు ఇలాంటి అమ్మాయి కావాల అంటూ కొందరు హార్దిక్ ని కించపరిచేలా కామెంట్స్ చేయడం గమనార్హం. అయితే.. హార్దిక్ అభిమానులు మాత్రం ఇలాంటి మీమ్స్ కి, ట్రోల్స్ కి బాగానే కౌంటర్లు ఇస్తున్నారు. హార్దిక్ కి రంగు లేకపోయినా.. టాలెంట్ చాలా ఉందంటూ మద్దతుగా నిలిస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై ఈ ప్రేమ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios