వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టీ20 మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చాడు. ముంబై వాంఖేడే‌లో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 71 పరుగులు చేశాడు.

మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్‌తో కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి హోంగ్రౌండ్‌లో విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత స్టాండ్‌లో భార్య రితికాతో కలిసి ఉన్న కూతురు సమైరాతో మాట్లాడేందుకు యత్నించాడు.

Also Read:ఆకాశమే హద్దుగా రోహిత్, కోహ్లీ: భారత్ రికార్డుల మోత, విండీస్ చెత్త రికార్డు

రోహిత్ శర్మ డ్రెస్సింగ్‌ రూమ్ నుంచే కూతురితో మాట్లాడేందుకు యత్నించిన సమయంలో ఫ్యాన్స్‌ ఫోటోల కోసం పోటీపడ్డారు. వరుసగా సెల్ఫీలు తీస్తూ హిట్‌మ్యాన్‌ను కెమెరాలో బంధించారు.

దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్, రోహిత్ ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు క్వశ్చన్ వేసింది. కాగా మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.

Also Read:గంగూలీ పదవి ఆ పుణ్యమే: బిసిసిఐ తీరుపై లోథా విస్మయం

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.