Asianet News TeluguAsianet News Telugu

గాయాలు సహజం.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: హార్డిక్ పాండ్యా

గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు, క్రికెట్‌కు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా తాను ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఐపీఎల్ 2020కి సిద్ధమయ్యానని చెబుతున్నాడు.

mumbai player Hardik Pandya excited about comeback in IPL
Author
Dubai - United Arab Emirates, First Published Sep 17, 2020, 2:29 PM IST

గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు, క్రికెట్‌కు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా తాను ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఐపీఎల్ 2020కి సిద్ధమయ్యానని చెబుతున్నాడు.

ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారైనట్లు పాండ్యా వెల్లడించాడు. ఎలాంటి తడబాటు లేకుండా సాగుతున్న బ్యాటింగ్ తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు.

Also Read:కెప్టెన్‌గా మారిన చాహాల్... బ్యాటింగ్ ఇలా చేయాలంటూ...

ఎప్పుడెప్పుడు గ్రౌండ్‌లోకి దిగి సంతృప్తికర ప్రదర్శన ఇస్తానా అని ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌తో పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని.. అందుకు తగ్గట్టుగానే తన ప్రాక్టీస్ జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశాడు.

రాబోయే కాలంలో అంతా శుభమే జరుగుతుందని ఆశిస్తున్నానని.. గాయాలనేవి క్రీడాకారుల జీవితంలో భాగమేనని.. వాటి కారణంగా తానెప్పుడూ వెనకడుగు వేయలేదని గుర్తుచేసుకున్నాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో జిమ్ ఉండటంతో తన ఫిట్‌నెస్‌లో ఎలాంటి మార్పు రాలేదని హార్డిక్ పాండ్యా వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios