రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా ఈ జట్టు, అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది. 2019 సీజన్ ప్రారంభంలో ‘ఈ సాల్ కప్ నమ్‌దే’ (ఈసారి కప్పు మనదే) స్లోగన్‌తో తెగ హడావుడి చేసిన ఆర్‌సీబీ, ఈసారి పెద్దగా సందడి చేయడం లేదు.

అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు తన స్టైల్‌లో ప్రయత్నిస్తున్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా ప్రాక్టీస్ ఎలా సాగుతుందనేదానిపై ఓ వీడియో చిత్రీకరించింది ఆర్‌సీబీ. దాదాపు 10 నిమిషాల పాటు సాగే ఈ వీడియో ట్విటర్‌లో పోస్టు చేసింది. భారత జట్టులో మహా తుంటరి, జాలీ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యజ్వేంద్ర చాహాల్, ఇందులోనూ తెగ అల్లరి చేశాడు.

ప్రాక్టీస్ సెషన్‌లో తానే కెప్టెన్‌నంటూ అందరితో ఆడుకున్న చాహాల్, ఏబీ డివిల్లియర్స్‌కు బ్యాటింగ్ పాఠాలు కూడా నేర్పాడు. మిగిలినవారికి అర్థం కాకుండా ఆర్‌సీబీ జట్టు సభ్యులందరూ ఓ కోడ్ భాషలో సంభాషించుకుంటున్నారు. 


గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ ప్రదర్శన, విరాట్ కోహ్లీకి కీలకంగా మారనుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.