Mohammed Shami : వరల్డ్ కప్ ట్రోఫీ పై మిచెల్ మార్ష్ పాదాలు.. ఆ ఫొటోను చూసి చాలా బాధపడ్డా - మహ్మద్ షమీ
వరల్డ్ కప్ ట్రోఫీ (cricket world cup 2023 - Trophy) పై ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) పాదాలు పెట్టడంపై పై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) తాజాగా స్పందించారు. ఈ ఫొటో తనను చాలా బాధపెట్టిందని చెప్పారు.
వరల్డ్ కప్ ట్రోఫీ పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పాదాలు పెట్టిన ఫొటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోపై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని చూసి చాలా బాధపడ్డానని చెప్పారు. గురువారం మహ్మద్ షమీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను వైరల్ అయిన ఫొటోపై ప్రతిస్పందన అడిగినప్పుడు ఈ విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విషాదం.. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరికి గాయాలు..
‘‘ఆ ఫొటోను చూసి నేను బాధపడ్డాను. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లు పోరాడుతున్న ట్రోఫీ, మేము, మా తలపై ఎత్తాలనుకుంటున్న ట్రోఫీ, దానిపై అడుగు పెట్టడం నిజంగా బాధాకరం.’’ అని అన్నారు. ఇదే సమయంలో వరల్డ్ కప్ లో మొదటి నాలుగు మ్యాచ్‌లలో ప్లేయింగ్-11లో చోటు దక్కించుకోలేక పోవడంపై అడిగిన ప్రశ్నకు కూడా షమీ సమాధానమిచ్చాడు. ‘‘నాలుగు మ్యాచ్‌లకు దూరంగా కూర్చున్నప్పుడు మానసికంగా దృఢంగా ఉండాలి. కొన్నిసార్లు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. కానీ జట్టు బాగా రాణిస్తున్నప్పుడు సంతోషంగా ఉంటారు.’’ అని అన్నారు.
కాగా.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచారు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశారు. ఈ సమయంలో ఆయన మూడుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యారు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్లు పడగొట్టారు. షమీ ఈ బలమైన ప్రపంచ కప్ ప్రదర్శన ప్రస్తుతం అతడిని భారతదేశం అత్యంత ఇష్టమైన క్రికెటర్ల జాబితాలో చేర్చింది.