'హార్దిక్ పాండ్యా ఏం కెప్టెన్సీ అయ్యా అది.. ! ఇలాగేనా.. '

MI vs SRH : ఐపీఎల్ 2024లో బుధ‌వారం జ‌రిగిన ముంబై ఇండియ‌న్స్-హైద‌రాబాద్ మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. ఇరు జట్లు క‌లిపి 500 పైగా ప‌రుగులు చేశాయి. అయితే, అద్భుత ఆటతో రాణించిన హైద‌రాబాద్ ను గెలుపు వ‌రించింది. 
 

MI vs SRH : Mumbai vs Hyderabad fight.. Yusuf Pathan's harsh comments on Hardik Pandya's captaincy Tom Moody RMA

Yusuf Pathan on Hardik Pandya's captaincy: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) లో బుధ‌వారం జ‌రిగిన ముంబై ఇండియ‌న్స్ vs సన్‌రైజర్స్ హైద‌రాబాద్ మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు అద‌ర‌గొట్ట‌డంతో ఈ మ్యాచ్ లో 500ల‌కు పైగా ప‌రుగులు న‌మోద‌య్యాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేసి ఐపీఎల్ లో చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ముంబై టీమ్ 31 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. అయితే, భారత మాజీ ప్లేయ‌ర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తొలి ఇన్నింగ్స్ లో చెడ్డ కెప్టెన్సీగా పేర్కొన్నాడు.

స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ సేవ‌ల‌ను ఆల‌స్యంగా ఉప‌యోగించుకోవ‌డం పై విమ‌ర్శ‌లు గుప్పించాడు పఠాన్. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్-బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త‌ప్ప మిగ‌తా బౌల‌ర్లు అంద‌రూ 10కి పైగా ఎకాన‌మీతో ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. మొదటి 11లో బుమ్రాను కేవలం ఒక ఓవర్ కోసం ఉపయోగించాడని యూస‌ఫ్ విమర్శించాడు. దీంతో హైద‌రాబాద్ టీమ్ మొదటి 10 ఓవ‌ర్ల‌లో 148 పరుగులు చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. అలాగే, 12 ఓవర్లలో 173 పరుగులకు ముందు బుమ్రాను హైదరాబాద్‌లో పాండ్యా తన రెండో ఓవర్‌కు తిరిగి తీసుకువచ్చాడు. ఇది బ్యాడ్ కెప్టెన్సీ అంటూ కామెంట్స్ చేశాడు.

 

అలాగే, బుమ్రాను ఉపయోగించుకునే తీరుపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ టామ్ మూడీ కూడా హార్దిక్ పాండ్యాను ప్రశ్నించారు. "జస్ప్రీత్ బుమ్రా ఎక్కడ ఉన్నాడు?? గేమ్ దాదాపు పూర్తయింది. మీ అత్యుత్తమ బౌలర్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసాడు!" అని మూడీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

 

హైద‌రాబాద్ త‌ర‌ఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీలు కొట్టిన టాప్-5 ప్లేయ‌ర్లు వీరే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios