హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే..
Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ పరుగుల వరద పారించాడు. ముంబై బౌలింగ్ ను చిత్తుచేస్తూ బౌండరీల వర్షం కురిపిస్తూ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు.
David Warner, Abhishek Sharma, Travis Head, Hyderabad
MI vs SRH : ఐపీఎల్ 2024లో బుధవారం జరిగిన ముంబై ఇండియన్స్-హైదరాబాద్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఇరు టీమ్స్ కలిపి 500 పైగా పరుగులు చేశాయి. ప్లేయర్లు సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ లు బ్యాట్ దుమ్మురేపుతూ రికార్డు హాఫ్ సెంచరీలు కొట్టారు.
అభిషేక్ శర్మ
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2024లో ముంబై తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు.
ట్రావిస్ హెడ్
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు.
orange cap david warner .
డేవిడ్ వార్నర్
సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, సూపర్ హిట్టర్ డేవిడ్ వార్నర్ ఈ లిస్టులో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాడు. ఐపీఎల్ 2015లో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో వార్నర్ భాయ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2017లో కూడా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 2016లో ఆర్సీబీపై 21 బంతుల్లో వార్నర్ ఫిఫ్టీ సాధించాడు.
మొయిసిస్ హెండ్రిక్స్‌ను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. రూ.4 కోట్ల 20 లక్షలకు హెండ్రిక్స్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
మోయిసెస్ హెన్రిక్స్
ఐపీఎల్ 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో మోయిసెస్ హెన్రిక్స్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు.