ఇండియన్ ప్రీమియమ్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుండి రోహిత్ శర్మకు ఎదురులేకుండా పోయింది. తన హిట్టింగ్ తో అభిమానులకు చేరువైన అతడికి ముంబై యాజమాన్యం మరింత ప్రోత్సహించి జట్టు పగ్గాలను అందించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాయకుడిగానే కాకుండా ఆటగాడిగా కూడా రాణిస్తూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇలా ముంబై ని సక్సెస్‌ఫుల్ జట్టుగా నిలబెట్టడమే కాకుండా తాను కూడా సక్సెస్‌ఫుల్ ఆటగాడినని పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 

చెన్నైలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'' అందుకున్నాడు. ఈ అవార్డుతో కలిపి ఐపిఎల్ లో ఇప్పటివరకు అతడు మొత్తం 17 మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఇలా ఇప్పటివరకు ధోని(16అవార్డులు) పేరిట వున్న అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును రోహిత్ చెన్నై మ్యాచ్ లోనే బద్దలుగొట్టాడు. 

ఇప్పటివరకు ఎంఎస్‌ ధోని, యూసఫ్‌ పఠాన్‌ సంయుక్తంగా 16 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో టాప్ లో నిలిచారు. ఈ మ్యాచ్ ద్వారా వారికి అధిగమించిన రోహిత్ 17 అవార్డులతో మొదటి స్థానానికి చేరుకుని వారిని రెండో స్థానంలోకి నెట్టాడు. ఇక 14 అవార్డులతో సురేశ్‌ రైనా మూడో స్థానంలో వుండగా,  గౌతమ్‌ గంభీర్‌ 13 సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ను అందుకున్నాడు.  కోహ్లి, రహానే 12 సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’అవార్డును దక్కించుకున్నారు.

ఐపిఎల్ 12 సీజన్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే తో ముంబై తలపడింది. ఈ మ్యాచ్ లో మరోసారి బ్యాట్ తో చేలరేగిన రోహిత్ 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 48 బంతుల్లో 67 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు బ్యాటింగ్ లో తడబడుతూ ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా రోహిత్ సమయోచితంగా ఆడాడు. తాను   హాఫ్ సెంచరీ సాధించడమే కాదు ముంబై 155 పరుగులు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇలా అందరు ఆటగాళ్లు విఫలమైన చోట రోహిత్ ఒక్కడే రాణించి 46 పరుగుల తేడాతో  జట్టును విజయతీరాకు చేర్చడంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

మరిన్ని వార్తలు

ధోనియే మమ్మల్ని గెలిపించాడు : రోహిత్ శర్మ

అవెంజర్స్‌లో ఇకనుంచి హిట్ మ్యాన్ కూడా: రోహిత్ పై పాండ్యా ఆసక్తికర ట్వీట్

కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... అరుదైన రికార్డు బద్దలు

మలింగ మాయాజాలం...ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై