టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతుల నిన్నటితో 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ధోని భార్య సాక్షి ఇంస్టాగ్రామ్ వేదికగా అనేక ఫోటోలను పోస్ట్ చేసింది. 

పది సంవత్సరాల ప్రయాణంలో   ప్రేమకు చిహ్నమైన చిన్నారి కూతురు జీవ తో తమ ముగ్గురి జీవన గమనాన్ని ప్రతిబింబించే ఫోటోల ను షేర్ చేసింది సాక్షి. ఈ పది సంవత్సరాల కాలంలో తమరి బంధం మరింత బలపడిందని, అప్పుడప్పుడు తమ ఇద్దరి మధ్యఏర్పడ్డ చిన్న చిన్న మనస్పర్థలు తమ మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని ఆమె రాసుకొచ్చారు. 

ఇకపోతే ఈ లాక్ డౌన్ కాలమంతా తన  లోనే గడుపుతున్నాడు. కూతురితో కలిసి దొరికిన ఈ  పూర్తిగా ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోజుకోలాగా దర్శనమిస్తున్నాడు. ఒకప్పుడు బాగా హెయిర్ పెంచి.. ఏకంగా పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్‌తో ప్రశంసలు పొందిన హెయిర్ స్టైల్ ఆయనది.

Also Read:కూతురితో ధోనీ బైక్ రైడ్... వీడియో వైరల్

కానీ ధోని ప్రస్తుతం తన జుట్టు గురించి కేర్ తీసుకోవడం లేదు. తాజాగా నెరిసిన గడ్డంతో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు ధోనీ. మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మిస్టర్ కూల్.. లాక్‌డౌన్ సడలింపులు వచ్చినా లుక్ మార్చడం లేదు.

పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయిస్తున్నారు ధోనీ. అక్కడే సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తూ.. కుమార్తెతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Also Read:ధోనీకి నిద్రలో కూడా అదే పిచ్చి.. అభిమానులతో సాక్షి

నెరిసిన గడ్డంతో ఫామ్‌హౌస్‌లో విత్తనాలు చల్లుతూ, రైతులతో మాట్లాడుతున్న ధోనీ ఫోటోలు ఇటీవలి కాలంలో వైరల్ అయ్యాయి. అయితే పుట్టినరోజు నాటికైనా మహేంద్రుడు తన లుక్‌ని మార్చాలని కొంతమంది అభిమానులు సూచిస్తుండగా.. ఈ లుక్ కూడా బాగుందని ఇంకొందరు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు జూలై 7న 39వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు ధోనీ. ట్విట్టర్‌లో ఇప్పటికే #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారిపోయింది.