Asianet News TeluguAsianet News Telugu

కూతురితో ధోనీ బైక్ రైడ్... వీడియో వైరల్

ధోనికి బైక్‌ రైడ్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాంచీ వీధుల్లో అర్దరాత్రులు తన స్నేహితులతో కలిసి తిరగడం ఎంతో ఇష్టమని గతంలో చాలాసార్లు ధోనీ నే స్వయంగా చెప్పాడు. కాగా.. ఈ లాక్ డౌన్ సమయంలో  ధోనీ బైక్ లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడంటూ ఇటీవల సాక్షి కూడా పేర్కొంది.

MS Dhoni Steals The Thunder As Sakshi Shares Video Of Cloudy Skies In Ranchi
Author
Hyderabad, First Published Jun 3, 2020, 9:35 AM IST

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. జరగాల్సిన ఎన్నో మ్యాచ్ లు వాయిదా పడిపోయాయి. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. భార్య, కూతురితో జాలీగా గడుపుతున్నారు. తాజాగా వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

జీవాతో బైక్‌పై ధోని చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోని సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ఉండగా.. ధోనీ బైక్‌పై వచ్చాడు.  సాక్షి దగ్గర ఉన్న జీవాని బైక్‌పై ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి ఫామ్‌హౌస్‌లో తిరగడం.. ఇదంతా లైవ్‌ సెషన్‌లో కనిపిస్తుంటుంది. ఆ వీడియోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Jun 2, 2020 at 7:10am PDT

 

ధోనికి బైక్‌ రైడ్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాంచీ వీధుల్లో అర్దరాత్రులు తన స్నేహితులతో కలిసి తిరగడం ఎంతో ఇష్టమని గతంలో చాలాసార్లు ధోనీ నే స్వయంగా చెప్పాడు. కాగా.. ఈ లాక్ డౌన్ సమయంలో  ధోనీ బైక్ లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడంటూ ఇటీవల సాక్షి కూడా పేర్కొంది.

ఇదిలా ఉండగా... ఈ లాక్ డౌన్ కారణంగా మరోసారి ధోనీ రిటైర్మెంట్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ వేదికగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. 

కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. అంతేకాకుండా #dhoniretire అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

అయితే ఈ వార్తలను ధోని సతీమణి సాక్షి సింగ్‌ రావత్‌తో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. 

ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి చేసిన ట్వీట్‌ వివాదస్పదమైంది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios