తమ కన్నా ఎక్కువ పబ్జీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడంటూ సాక్షి పేర్కొనడం గమనార్హం. పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా పబ్జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని సాక్షి తెలిపింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అతని భార్య సాక్షి ధోనీ మేజర్ కంప్లైంట్ చేసింది. ధోనీకి నిద్రలో కూడా పబ్జీ పిచ్చే అంటూ సాక్షి తాజాగా పేర్కొంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచం స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమయాన్ని మహి.. తన కుటుంబంతో గడుపుతున్నాడు.
అయితే.. తమ కన్నా ఎక్కువ పబ్జీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడంటూ సాక్షి పేర్కొనడం గమనార్హం. పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా పబ్జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని సాక్షి తెలిపింది. చెన్నై సూపర్‌కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాలో లైవ్‌లో తాజాగా పాల్గొన్న సాక్షి ధోనీ.. తన భర్త గురించి పలు విషయాలు పంచుకుంది.
”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. అతని మైండ్ కు రెస్ట్ లేదు. పబ్జీ ఆడేటప్పుడు మాత్రం అతడి మనసు మళ్లుతుంది. ఇటీవలి కాలంలో బెడ్‌పై కూడా ధోనీ ఆ గేమ్ గురించే ఆలోచిస్తున్నాడు. నిద్రలో సౌతం పబ్జీని కలవరిస్తున్నాడు” అని సాక్షి సింగ్ పేర్కొన్నారు.
అలానే లాక్‌డౌన్ సమయంలో ధోని ఎక్కువ సమయాన్ని బైక్‌లతో గడుపుతున్నాడని సాక్షి చెప్పింది. మహీకి మొత్తం 9 బైకులు ఉన్నాయని..వాటికి సంబంధించిన కొత్త స్పేర్ పార్ట్స్ ప్రస్తుతం అమర్చుతున్నాడని వెల్లడించింది. 38 ఏళ్ల ధోనీ చివరగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆడాడు. ఆ తర్వాత ఆటకు టెంపరరీ విరామం ప్రకటించాడు. కాగా ధోని రిటైర్మెంట్ కు సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తూనే ఉంటుంది.
ఇటీవల కూడా ఇలాంటి కామెంట్స్ వినపడగా... సాక్షి తీవ్రంగా స్పందించింది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.
