Asianet News TeluguAsianet News Telugu

IPL 2024 ఫైన‌ల్ కు చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ అక్కడే బోల్తా పడింది..

KKR vs SRH: ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లలో బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ను చిత్తుగా ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది. అయ్యర్ బ్రదర్స్ బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టారు.
 

Kolkata Knight Riders reach ipl 2024 final Sunrisers Hyderabad lost Qualifier 1 match match  RMA
Author
First Published May 21, 2024, 11:16 PM IST

IPL 2024 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్-2024) క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జ‌ట్లు త‌ల‌ప‌డున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత‌న ప్ర‌ద‌ర్శ‌న చేసి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. లీగ్ ద‌శ‌లో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడిన హైద‌రాబాద్ బ్యాట‌ర్లు కీల‌క మ్యాచ్ లో తుస్సు మ‌న్నారు. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది స‌న్ రైజ‌ర్స్. అదే స‌మ‌యంలో కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద‌ర‌గొట్టారు.

తుస్సుమన్న హైదరాబాద్ బ్యాటింగ్..

క్వాలిఫ‌య‌ర్ 1  టాస్ గెలిచిన హైద‌రాబాద్ టీమ్ మొద‌ట బ్యాటింగ్ దిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఈ సీజ‌న్ లో లీగ్ ద‌శ‌లో దుమ్మురేపే బ్యాటింగ్ ప‌వ‌ర్ ను చూపించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్లు కీల‌క మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ 0, అభిషేక్ శ‌ర్మ 3, నితీష్ రెడ్డి 9, షాబాజ్ అహ్మ‌ద్ 0, స‌మ‌ద్ 16 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడ‌టంతో స‌న్ రైజ‌ర్స్ స్కోర్ 150+ చేరుకుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌ను ర‌నౌట్ అయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ 32, ప్యాట్ క‌మ్మిన్స్ 30 ప‌రుగులు చేశారు.

సూపర్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్

కోల్ క‌తా అద్భుత‌మైన బౌలింగ్ లో 20 ఓవ‌ర్లు పూర్తి కాక‌ముందే హైద‌రాబాద్ టీమ్ ఆలౌట్ అయింది. 19.3 ఓవ‌ర్ల‌లో 10 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. మిచెల్ స్టార్క్ సూప‌ర్ బౌలింగ్ తో హైద‌రాబాద్ టీమ్ ను దెబ్బ‌కొట్టాడు. స్టార్క్ 3 వికెట్లు, చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్,రస్సెల్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.  ఈ మ్యాచ్ లో ఆండ్రీ రస్సెల్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

అదరగొట్టిన అయ్యర్ బ్ర‌ద‌ర్స్.. చెత్త బౌలింగ్-ఫీల్డింగ్

160 పరుగుల తేడాతో బరిలోకి దిగిన కేకేఆర్ కు మంచి శుభారంభం ల‌భించింది. మ‌రోసారి ఓపెన‌ర్లు మంచి ఆట‌ను ఆడారు. సునీల్ న‌రైన్ 21, రహ్మానుల్లా గుర్బాజ్ 23 ప‌రుగులు చేశారు. వీరిద్ద‌రు ఔట్ అయిన త‌ర్వాత అయ్య‌ర్ బ్ర‌ద‌ర్స్ అద‌ర‌గొట్టారు. హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ల‌తో ధ‌నాధ‌న్ బ్యాటింగ్  చేసి కేకేఆర్ కు విజ‌యాన్ని అందించారు. వెంక‌టేశ్ అయ్యర్ 51*, శ్రేయాస్ అయ్య‌ర్ 58* ప‌రుగులు చేశారు. 13.4 ఓవ‌ర్ల‌లోనే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 164 ప‌రుగులతో హైద‌రాబాద్ ను చిత్తుచేసింది.

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో తుస్సుమ‌న్న హైద‌రాబాద్ టీమ్.. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఒక వికెట్ తీసుకున్నప్పటికీ 3 ఓవర్లలో 38 పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 28, ట్రావిస్ హెడ్ 1.4 ఓవర్లలో 32 పరుగులు, విజయకాంత్ 2 ఓవర్లలో 22 పరుగులు, నితీష్ రెడ్డి ఒక ఓవర్ లో 13 పరుగులు సమర్పించుకున్నారు. 3 ఓవర్ల బౌలింగ్ లో నటరాజన్ 7.30 ఎకానమీతో ఒక వికెట్ తీసుకున్నాడు. హైదరాబాద్ ఫీల్డింగ్ కూడా అంత మెరుగ్గా లేదు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ లు సులభమైన క్యాచ్ లను వదిలిపెట్టారు.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో వీరి ఆట‌ను చూడాల్సిందే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios