Asianet News TeluguAsianet News Telugu

అచ్చ తెలుగులో మాట్లాడి, అదరగొట్టిన దినేశ్ కార్తీక్... కేకేఆర్ వికెట్ కీపర్ తెలుగు స్పీచ్‌కి...

IPL 2021 CSK vs KKR: ఫైనల్ మ్యాచ్‌కి ముందు తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చిన దినేశ్ కార్తీక్... డీకే అచ్చ తెలుగు స్పీచ్‌కి ఫ్యాన్స్ ఫిదా...

KKR Wicket Keeper Dinesh Karthik Impressed with his Telugu speech in final
Author
India, First Published Oct 16, 2021, 10:48 AM IST

ఐపీఎల్ 2021లో హైదరాబాద్ టీమ్ పర్ఫామెన్స్‌తో తీవ్రంగా నిరాశపరిచినా, ఈ సీజన్‌లో తెలుగు గుబాళింపులను చూసే అవకాశం తెలుగువారికి దక్కింది... హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచి, మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...

అదీకాకుండా ఆర్‌సీబీ తరుపున ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోన శ్రీకర్ భరత్, మ్యాచ్ విన్నింగ్ పర్పామెన్స్‌లతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ చివరి బంతికి కెఎస్ భరత్ కొట్టిన సిక్సర్, ఈ సీజన్‌లోనే హైలైట్ ఇన్నింగ్స్‌లలో ఒకటి...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీకర్ భరత్, తెలుగులోనే సమాధానాలు చెప్పి... మాతృభాష మాధుర్యాన్ని పరిచయం చేశాడు. తాజాగా ఫైనల్ మ్యాచ్‌కి ముందు కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి, స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

తెలుగులో మాట్లాడడం అంటే ఏదో మొహమాటానికి వచ్చీ రాని రెండు మూడు వ్యాఖ్యలు మాట్లాడి, ఊరుకోవడం కాదు... అచ్చు తెలుగువాడిలా ఆసాంతం తెలుగులోనే సమాధానాలు ఇచ్చాడు... తమిళనాడులో జన్మించిన దినేశ్ కార్తీక్‌, ఇంగ్లాండ్ టూర్‌లో ఇంగ్లీష్ కామెంటరీతో అక్కడి వారి హృదయాలను గెలుచుకుని, పోలింగ్‌లో బెస్ట్ కామెంటేటర్‌ అవార్డు కూడా గెలిచాడు. కార్తీక్‌తో తెలుగుతో పాటు హిందీ, మాతృభాష తమిళ్ కూడా అనర్గళంగా మాట్లాడగలడు.. 

 

ఇదీ చదవండి: సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

Follow Us:
Download App:
  • android
  • ios