KKR vs SRH : స్టార్క్ దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్

KKR vs SRH: ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లలో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కీలకమైన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కోల్ కతా  స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ బాల్ తో అద్భుతం చేశాడు.
 

KKR vs SRH: Mitchell Starc shocks Sunrisers Hyderabad in deep trouble, Kolkata Knight Riders vs Sunrisers Hyderabad RMA

IPL 2024 Qualifier-1 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్-2024) క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జ‌ట్లు త‌ల‌ప‌డున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ టీమ్ మొద‌ట బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఈ సీజ‌న్ లో లీగ్ ద‌శ‌లో దుమ్మురేపే బ్యాటింగ్ ప‌వ‌ర్ ను చూపించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్లు కీల‌క మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. కేకేఆర్ స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ అద్భుత‌మైన బౌలింగ్ తో ట్రావిస్ హెడ్ ను రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియ‌న్ కు పంపాడు.

 

 

మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను కూడా ఈ మ్యాచ్ లో నిరాశ‌ప‌రిచాడు. తొలి ఓవ‌ర్ లో ట్రావిస్ హెడ్ ఔట్ కాగా, రెండో ఓవ‌ర్ లో అభిషేక్ శ‌ర్మ కూడా పెవిలియ‌న్ చేరాడు. రెండో ఓవ‌ర్ 5వ బంతికి వైభ‌వ్ అరోరా బౌలింగ్ లో భారీ షాట్ కోట్ట‌బోయిన అభిషేక్.. క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఆండ్రీ ర‌స్సెస్ గాల్లోకి ఎగిరి అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ ఐదో ఓవ‌ర్ ను బౌలింగ్ చేయ‌డానికి మిచెల్ స్టార్క్ వ‌చ్చాడు. మ‌రోసారి సూప‌ర్ బౌలింగ్ తో ఈ ఓవ‌ర్ లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ ఓవ‌ర్ 5వ బంతికి నితీష్ రెడ్డి ఔట్ కాగా, 6వ బంతికి షాబాజ్ అహ్మ‌ద్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 5 ఓవ‌ర్ల‌కే 4 వికెట్లు కోల్పోయింది. అద‌ర‌గొడుతార‌నున్న హీరోలు జీరోలుగా వెనుతిరగ‌డంతో హైద‌రాబాద్ జ‌ట్టు పీక‌ల్లోకూ క‌ష్టాల్లో ప‌డింది. 

నా ఆట గురించి నాకు తెలుసు.. ఎవ‌రికీ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు : విరాట్ కోహ్లీ

 

 

 

ఇరు జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ 11): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టి నటరాజన్.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో వీరి ఆట‌ను చూడాల్సిందే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios