KKR vs RR Highlights : ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేసిన జోస్ బట్లర్..
KKR vs RR Highlights : ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేశాడు. సెంచరీ ఇన్నింగ్స్ తో చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో కోల్ కతాపై ఆర్ఆర్ కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
IPL 2024 KKR vs RR Highlights : ఐపీఎల్ 2024లో కోల్‌కతా జట్టు అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్లను భయపెట్టింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాపర్ గా ఉన్న రాజస్థాన్‌కు, రెండో స్థానంలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ కు మధ్య ఐపీఎల్ 2024 లో 31వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. దాదాపు కేకేఆర్ వైపు ఉన్న మ్యాచ్ ను జోస్ బట్లర్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేశాడు. కేకేఆర్ నుంచి లాక్కుని ఆర్ఆర్ కు అంద్భుతమైన విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో కేకేఆర్ 20 ఓవర్లలో 223/6 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి పరుగులు (224/8) చేసి థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
సునీల్ నరైన్ సునామీ..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేయగా, సునీల్ నరైన్ క్రీజులోకి వచ్చాడు. ఒక ఎండ్ నుంచి వికెట్ల పతనం కొనసాగుతుండగా, మరో ఎండ్ నుంచి నరైన్ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. కేకేఆర్ తరఫున నరైన్ తన కెరీర్‌లో తొలి సెంచరీని బాదాడు. 109 పరుగుల ఇన్నింగ్స్‌లో 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, 13 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది ఈ ఇన్నింగ్స్ చివరలో రింకూ సింగ్ 9 బంతుల్లో 20 పరుగులు సాధించాడు.
ఏం కొట్టాడు భయ్యా.. నరైన్ మామా దెబ్బకు స్టేడియం షేక్ అయింది..
కుల్దీప్ అద్భుత బౌలింగ్
రాజస్థాన్ తరఫున ఫాస్ట్ బౌలర్లు అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇద్దరూ తలో 2 ముఖ్యమైన వికెట్లు తీశారు. అలాగే, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ కూడా తలా ఒక బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ కు పంపారు. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే చాహల్, అశ్విన్ లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చాహల్ 4 ఓవర్లలో 54 పరుగులు ఇవ్వగా, అశ్విన్ 49 పరుగులు సమర్పించుకున్నాడు. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. వరుసగా వికెట్లు కోల్పోయిన తరుణంలో ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేశాడు జోస్ బట్లర్.
బట్లర్ 'వన్ మ్యాన్' షో.. గెలుపు అంటే ఇది కదా..
224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ నుంచి సంజూ శాంసన్ వరకు అందరూ ఫ్లాప్ షో తో పెవిలియన్ కు చేరారు. కానీ జోస్ బట్లర్ ఒంటరిగా రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని అందించాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐసీఎల్ లో టార్గెట్ ను ఛేదించే సమయంలో తన రెండవ సెంచరీని సాధించాడు. చివరి బంతివరకు సాగిన ఈ మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది రాజస్థాన్ రాయల్స్. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ముందుకు కొనసాగుతుంది.
సంక్షిప్త స్కోర్లు :
కేకేఆర్ : 223/6 (20 ఓవర్లలో), సునీల్ నరైన్ 109 పరుగులు, రఘువంశీ 30, రింకూ సింగ్ 20 పరుగులు ,
రాజస్థాన్ : 224/8 (20 ఓవర్లలో). జోస్ బట్లర్ 107, రియన్ పరాగ్ 34, రోవ్మాన్ పావెల్ 26 పరుగులు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర