Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ ఓడినా పంజాబీ గెలిచాడు...కొడుకు క్రీజులో, తండ్రి పోడియంలో

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా శుక్రవారం పంజాబ్ రాజధాని చండీఘడ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ప్లేఆఫ్ కోసం కింగ్స్ లెవెన్ పంజాబ్,  కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్న సమయంలో పంజాబ్ అభిమానులకు ఓ సంకట పరిస్థితిని ఎదురయ్యింది.ముఖ్యంగా కెకెఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వారికి ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థంకాలేదు. ఓ వైపు సొంత జట్టు ఓటమివైపు పయనిస్తుంటే మరో వైపు సొంత రాష్ట్రానికి చెందిన కెకెఆర్ ఓపెనర్  శుభ్ మన్ గిల్ విజయంవైపు దూసుకెళుతున్నాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటుతున్నాడు. ఇలా పంజాబ్ అభిమానులు జట్టు ఓడిపోయిందన్న బాధ, మన కుర్రాడే కెకెఆర్ ను గెలిపించాడన్న ఆనందాన్ని ఒకేసారి పొందారు. 

kkr player shubman gill super innings against kings eleven punjab
Author
Chandigarh, First Published May 4, 2019, 2:41 PM IST

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా శుక్రవారం పంజాబ్ రాజధాని చండీఘడ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ప్లేఆఫ్ కోసం కింగ్స్ లెవెన్ పంజాబ్,  కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్న సమయంలో పంజాబ్ అభిమానులకు ఓ సంకట పరిస్థితిని ఎదురయ్యింది.ముఖ్యంగా కెకెఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వారికి ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థంకాలేదు. ఓ వైపు సొంత జట్టు ఓటమివైపు పయనిస్తుంటే మరో వైపు సొంత రాష్ట్రానికి చెందిన కెకెఆర్ ఓపెనర్  శుభ్ మన్ గిల్ విజయంవైపు దూసుకెళుతున్నాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటుతున్నాడు. ఇలా పంజాబ్ అభిమానులు జట్టు ఓడిపోయిందన్న బాధ, మన కుర్రాడే కెకెఆర్ ను గెలిపించాడన్న ఆనందాన్ని ఒకేసారి పొందారు. 

శుభ్ మన్ గిల్... 1999 సెప్టెంబర్ 8 న పంజాబ్ లోని ఫజిల్కాలో జన్మించాడు. చిన్నప్పటి నుండి క్రికెట్ పై మక్కువ పెంచుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇలా పంజాబ్ అండర్ 16, పంజాబ్ అండర్ 19 తో పాటు ఇండియా అండర్ 19 జట్ల  తరపున ఆడాడు. ఇలా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న అతడిపై కెకెఆర్ ఫ్రాంచైజీ దృష్టి పడింది ఇంకేముంది  పంజాబ్ కుర్రాడు కాస్తా కోల్‌కతా టీం సభ్యునిగా మారిపోయాడు. 

అయితే ఐపిఎల్ సీజన్ 12లో వరుస ఓటములతో సతమతమవుతూ ప్లేఆఫ్ అవకాశాలను జటిలం చేసుకుంది కెకెఆర్. ఇలాంటి సమయంలో పంజాబ్ తో అమితుమీకి సిద్దమయ్యింది. ఈ రెండు జట్లు కూడా ప్లేఆప్ కోసం పోటీ పడుతుండటంతో ఈ మ్యాచ్ ను తప్పకుండా గెలవాలి. అలాంటి నిర్ణయయాత్మక మ్యాచ్ సొంత రాష్ట్రానికి చెందిన జట్టుపై కెకెఆర్ ఆటగాడు శుభ్ మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన గిల్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా నిలిచి 65 పరుగులు చేశాడు. ఇలా చివరివరకు నిలిచి కెకెఆర్ విజయంలో ముఖ్య పాత్ర పోషించి తాను చిన్నప్పటి నుండి క్రికెట్ ఓనమాలు నేర్చిన మైదానంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో ఓవైపు శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్ లో చేలరేగుతుంటే మరోవైపు అతని తండ్రి ప్రేక్షకుల గ్యాలరీలో హల్‌చల్‌ చేశారు. కొడుకు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గిల్‌ తల్లిదండ్రులు మైదానానికి విచ్చేశారు. అయితే తమను నిరాశపర్చకుండా అద్భుతంగా ఆడుతున్న కొడుకును చేసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పరవశించిపోయారు.  ఇక గిల్ తండ్రి అయితే ఆ ఆనందంలో సాధారణ అభిమాని మాదిరిగానే చిందులేస్తూ కనిపించాడు. ఈ విషయాన్న కెకెఆర్ యజమాని షారుఖ్‌ ఖాన్‌ సైతం పసిగట్టినట్లున్నాడుజ మ్యాచ్ అనంతరం గిల్ ను అభినందిస్తూ పప్పా బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. తండ్రిని, కుటుంబాన్ని తన ఆటతీరుతో గర్వించేలా చేసిన గిల్ కు అభినందనలు అంటూ షారుఖ్ ట్వీట్ చేశాడు.    

సంబంధిత వార్తలు

అరుదైన ఐపిఎల్ రికార్డు బద్దలుగొట్టిన శుభ్‌మన్ గిల్ ...అతిచిన్న వయసులో

కార్తీక్ కి కోపం.. జోకులు పేలుస్తున్న నెటిజన్లు

Follow Us:
Download App:
  • android
  • ios