Asianet News TeluguAsianet News Telugu

అరుదైన ఐపిఎల్ రికార్డు బద్దలుగొట్టిన శుభ్‌మన్ గిల్ ...అతిచిన్న వయసులో

ఐపిఎల్ 2019 ప్లేఆఫ్ కోసం జరుగిన కోల్‌కతా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో వ్యక్తిగతంగా రాణించడంతో పాటు మ్యాచ్ చివరివరకు నిలిచి పంజాబ్ ను ఓడించడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ఆరంభంలో ఓపెనర్ గా బరితోకి దిగి చివరి బంతి వరకు ఆడి కెకెఆర్ కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే అతడి పేరిట కూడా ఓ అద్భుతమైన రికార్డు నమోదయ్యింది.

kkr opener Shubman Gill creates history in ipl
Author
Chandigarh, First Published May 4, 2019, 1:52 PM IST

ఐపిఎల్ 2019 ప్లేఆఫ్ కోసం జరుగిన కోల్‌కతా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో వ్యక్తిగతంగా రాణించడంతో పాటు మ్యాచ్ చివరివరకు నిలిచి పంజాబ్ ను ఓడించడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ఆరంభంలో ఓపెనర్ గా బరితోకి దిగి చివరి బంతి వరకు ఆడి కెకెఆర్ కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే అతడి పేరిట కూడా ఓ అద్భుతమైన రికార్డు నమోదయ్యింది.

చండీఘడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య కింగ్స్ లెవెన్ పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 184 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంచింది. అయితే ఈ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన కెకెఆర్ కు ఓపెనర్లు గిల్, లిన్ శుభారంభాన్నిచ్చారు. అంతేకాకుండా ఊతప్ప, రస్సెల్స్, కార్తిక్ లు కూడా నిరాశపర్చకుండా తమ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే కెకెఆర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చేజింగ్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో గిల్ అభిమానులను అలరించడమే కాదు హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 

ఐపిఎల్ చరిత్రలో అతిచన్న వయసులోనే నాలుగుమ హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల లోపు వయసున్న ఇతడి ఐపిఎల్ లో ఇది నాలుగో అర్థశతకం. ఇంతకు ముందు ఓ ముగ్గురు యువ  క్రికెటర్లు ఇరవై ఏళ్లలోపే మూడు సెంచరీలు బాదారు. ఇదే ఇప్పటివరకు రికార్డు. తాజాగా ఈ రికార్డును బద్దలుగొడుతూ గిల్ నాలుగో హాప్ సెంచరీ బాది తన సత్తా చాటాడు. 

184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కెకెఆర్ ను విజతీరాలకు చేర్చడంలో గిల్ ముఖ్య పాత్ర వహించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా నిలిచి 65 పరుగులు చేశాడు. ఇలా చివరివరకు నిలిచి కెకెఆర్ ను గెలిపించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపర్చాడు. జట్టు విజయంకోసం అజేయంగా పోరాడిన గిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios