Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్.. బీసీసీఐ ఏం చెప్పిందంటే..?

Team India : రాహుల్ ద్రావిడ్ ప‌దవీకాలం ముగియ‌నున్న క్ర‌మంలో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియాకు కొత్త ప్రధాన కోచ్‌ని ఎంపిక చేయడం కోసం బీసీసీఐ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ద్రవిడ్ తర్వాత ప్రధాన కోచ్ రేసులో భారత మాజీ ఓపెన‌ర్, ప్రపంచకప్ విజేత స‌భ్యుడైన‌ గౌతమ్ గంభీర్ పేరు వినిపిస్తోంది.
 

Kkr mentor Gautam Gambhir has been appointed as the head coach of the Indian cricket team?.. What did the BCCI say? RMA
Author
First Published May 18, 2024, 12:16 AM IST

Team India Head Coach : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ ఇండియా కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27. ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వచ్చే టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఈ క్ర‌మంలోనే కొత్త కోచ్ కోసం బీసీసీఐ క‌స‌ర్తులు ప్రారంభించింది. భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌ బాధ్యత ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా ఉన్న స‌మ‌య‌లో టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌతమ్ గంభీర్ పేరు తెర‌మీద‌కు  వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు మెంటార్‌గా ఉన్న గంభీర్‌ను బీసీసీఐ సంప్రదించిందని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. హెడ్ కోచ్ కు కావాల్సిన అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని గంభీర్ ను ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సూచించిన‌ట్టు స‌మాచారం.

కేకేఆర్ మెంటార్ గంభీర్.. 

42 ఏళ్ల గంభీర్‌కు అంతర్జాతీయ లేదా దేశీయ స్థాయిలో కోచింగ్ అనుభవం లేదు కానీ, రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోచింగ్ స్టాఫ్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2022, 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. ప్ర‌స్తుతం కేకేఆర్ మెంట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. గంభీర్ మెంటార్‌షిప్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ జట్టు 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

ప్రపంచ కప్ గెలిచిన భార‌త జ‌ట్టులో స‌భ్యుడు.. 

గౌత‌మ్ గంభీర్ 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఉన్నాడు. అలాగే, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ స‌భ్యునిగా కీల‌క మైన ఇన్నింగ్స్ లు ఆడాడు. 2011 నుంచి 2017 వరకు ఏడు ఐపీఎల్ సీజ‌న్ల‌లో కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్నాడు. గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ రెండు ఐపీఎల్ ట్రోఫీల‌ను గెలుచుకుంది. అలాగే, కేకేఆర్ ఐదుసార్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించగలిగింది. గంభీర్ కెప్టెన్సీలో 2014లో ముగిసిన ఛాంపియన్స్ లీగ్ టీ20లో కూడా కేకేఆర్ ఫైనల్‌కు చేరుకుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానించిన బీసీసీఐ

రాహుల్ ద్రావిడ్ ప‌ద‌వీకాలం ముగియ‌నున్న క్ర‌మంలో గత వారం బీసీసీఐ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. 'జులై 2024 నుండి డిసెంబర్ 2027 వరకు మూడున్నరేళ్ల కాలానికి ఈ ప‌ద‌వి  మొత్తం మూడు ఫార్మాట్‌లకు వర్తిస్తుంది' అని బీసీసీఐ తెలిపింది. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత భారతదేశ ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ తన రెండేళ్ల పదవీకాలాన్ని ప్రారంభించాడు. అతని పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో 2023 వ‌న్డే ప్రపంచ కప్ తర్వాత ముగియాల్సి ఉంది, అయితే అతను జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌లుగా జ‌రిగే టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసే వ‌ర‌కు కోచ్ గా కొన‌సాగ‌నున్నారు.

SRH vs GT : భారీ వ‌ర్షంతో గుజ‌రాత్ తో మ్యాచ్ ర‌ద్దు..హైదరాబాద్ కు గుడ్ న్యూస్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios