పోష్ స్ట్రూమ్: అండర్ 19 ప్రపంచ ప్ క్వార్టర్ ఫైనల్లో భారత బౌలర్ కార్తిక్ త్యాగిని తిట్టినందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ అలివర్ డేవిస్ ప్రతిఫలం అనుభవించాడు. కార్తిక్ త్యాగి వేలిన రెండో ఓవరు రెండో బంతిని డేవిస్ ఆడకుండా వదిలేశాడు. దాంతో బంతి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది.

ఆ వెంటనే బ్యాట్ ను పైకెత్తి డేవిస్ కార్తిక్ త్యాగి వైపు వెళ్తూ దూషణలకు దిగాడు. దానికి ప్రతిగా త్యాగి డేవిస్ వైపు గుడ్లురిమి చూశాడు. అయితే, ఆ తర్వాతి బంతికే కార్తిక్ త్యాగి బౌలింగులో డేవిస్ అవుటయ్ాయడు. 

Also Read: ఆసీస్ పై కార్తిక్ త్యాగి దెబ్బ: సెమీస్ కు దూసుకెళ్లిన యువ భారత్

త్యాగి ఆ తర్వాత వేసిన బంతిని డేవిస్ ఆడడానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్ ను ముద్దాడుతూ స్లిప్ లో ఉన్న యశస్వి జైస్వాల్ చేతిలోకి క్యాచ్ గా వెళ్లింది. దూషణలకు కార్తిక్ త్యాగి సరైన ప్రతీకారం తీర్చుకున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. త్యాగి తొలి ఓవరులోనే రెండు వికెట్లు తీశాడు. మూడో వికెట్ గా డేవిస్ వెనుదిరికాడు.

త్యాగి బౌలింగ్ దూకుడు దాంతో ఆగలేదు. ప్యాట్రిక్ రోయేను నాలుగో వికెట్ గా అవుట్ చేశాడు. ఈ మ్యాచులో త్యాగి నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్ లో భారత్ విజయం సాధించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా 74 పరుగుల తేడాతో ఇండియాపై ఓటమి పాలైంది.