Asianet News TeluguAsianet News Telugu

అవినీతి ఆరోపణలు: అంబటి రాయుడికి అజరుద్దీన్ రిప్లై

గురువారం అజారుద్దీన్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంథీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను ముందుగా 6వ తేదీన నిర్వహిస్తున్నామని చెప్పారు.

Will look into allegations: HCA president Mohammad Azharuddin
Author
Hyderabad, First Published Nov 29, 2019, 9:33 AM IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై అంటి రాయుడు అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... అంబటి చేసిన ఆరోపణలపై అజారుద్దీన్.. రిప్లై ఇచ్చారు. రాయుడు చేసిన ఆరోపణలను తాము పరిశీలిస్తామని చెప్పారు. కాగా.... ఈ ఆరోపణలు చేసి రాయుడు అడ్డంగా బుక్కయ్యారు.  ఆయనపై  చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AlsoRead దేవుడు అవకాశం ఇచ్చాడు... అజారుద్దీన్ కి రాయుడు సూచన...

భారత్-వెస్టిండీస్‌ల తొలి టీ20 ముంబైలో డిసెంబర్ 6వ తేదీన జరాగాల్సి ఉండగా, ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను హైదారాబాద్ నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపింది. దీంతో వచ్చే నెలలో వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం అజారుద్దీన్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంథీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను ముందుగా 6వ తేదీన నిర్వహిస్తున్నామని చెప్పారు.

హెచ్‌సీఏ అధ్యక్ష హోదాలో జరుగతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ అని, మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందకు కృషి చేస్తామన్నారు. క్రికెట్ అనేది ప్రతిరోజు నేర్చుకునే గేమ్, మ్యాచ్ తిలకించేందుకు వచ్చే అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, గురువారం నుంచి మ్యాచ్ టికెట్లు, ఈవెంట్స్ నౌడార్ట్‌కామ్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని అజారుద్దీన్ తెలిపారు. 

ఇటీవల హెచ్‌సీఏపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడుపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమెనట్లు తెలుస్తోంది. దీనిని అజారుద్దీన్ ముందు ప్రస్తావించగా... ఆ విషయంలో తాము దృష్టిసారిస్తామని.. ప్రస్తుతం టీ20 మ్యాచ్ పైనే తమ దృష్టంతా ఉందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios