ప్రస్తుతం బంగ్లాదేశ్ టీం.... భారత్ పర్యటనలో ఉంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్ల స్టేడియంలో మూడు మ్యాచ్  ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమౌతున్నాయి. కాగా... ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కనపడడు. సుదీర్ఘంగా మ్యాచులు ఆడుతున్న క్రమంలో కోహ్లీకి  ఈసిరీస్ కి బ్రేక్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సారథి లిటన్‌దాస్ మాట్లాడుతూ.. భారత జట్టులో కెప్టెన్ కోహ్లీ లేనంత మాత్రాన తాము అజాగ్రత్తగా ఉండబోమని, సాధ్యమైనంత వరకు మంచి ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తామని అన్నాడు. కోహ్లీ లేడని భారత జట్టు బలహీనంగా ఉంటుందని తాము భావించడం లేదన్నాడు.

 భారత జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. అయితే, తమ జట్టులో మాత్రం అనుభవజ్ఞులు లేరని, అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తామని అన్నాడు. కాగా, ఈ సిరీస్ నుంచి టీమిండియా సారథి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్‌శర్మకు పగ్గాలు అప్పగించారు.

Alsoread రవిశాస్త్రిని మరోలా వాడుకుందాం... గంగూలీ కామెంట్స్...

కాగా.... నవంబరు 3న న్యూఢిల్లీలో తొలి టీ20, 7న రాజ్‌కోట్‌లో, 10న నాగ్‌పూర్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పొట్టి ఫార్మాట్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. 

టెస్టు జట్టులో పెద్దగా మార్పులు లేకపోయినా.. టీ20లో తొలిసారిగా ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు బెర్త్‌ దక్కింది. భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున అతడు అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అలాగే కేరళ యంగ్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ కల నాలుగేళ్ల తర్వాత నెరవేరింది. 2015లో జింబాబ్వేపై అతడు ఏకైక టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

ఆ తర్వాత ఐపీఎల్‌లో, దేశవాళీల్లో చక్కటి ఆటతీరును కనబరుస్తున్నా జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. భారత్‌ ‘ఎ’ జట్టులో నిలకడగా రాణించే శాంసన్‌ ఇటీవలి విజయ్‌ హజారే ట్రోఫీలో ఏకంగా డబుల్‌ సెంచరీతో మెరవడంతో పాటు ఓవరాల్‌గా ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 125 స్ట్రయిక్‌ రేట్‌తో 410 పరుగులు సాధించాడు. దీంతో అతడికో అవకాశం కల్పించాలని సెలెక్షన్‌ కమిటీ భావించింది. 

AlsoRead అనుష్క స్ట్రాంగ్ కౌంటర్... క్షమాపణలు చెప్పిన ఫరూక్‌..

ఇక వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పేరు చర్చకు రాలేదు. అతడి స్థానంలో 26 ఏళ్ల శివమ్‌ దూబేకు చోటిచ్చారు. దీంతో విజయ్‌ శంకర్‌ స్థానం గల్లంతైంది. 

‘గతంలో హార్దిక్‌ ఉన్నప్పుడు రెండో ఆల్‌రౌండర్‌గా విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశాం. అయితే ఇప్పుడు ఆ స్థానంలో శివమ్‌ దూబే సరైన ఆటగాడని భావించాం. దూకుడుగా ఆడే దూబే భారత్‌ ‘ఎ’ తరఫున విండీస్‌ టూర్‌లో, దక్షిణాఫ్రికాపైనా సత్తా చాటాడు’ అని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే తెలిపాడు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజాకు విశ్రాంతినివ్వగా స్పిన్నర్‌ చాహల్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో పేసర్‌ సైనీ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.టెస్టు మ్యాచ్  సమయానికి మళ్లీ కోహ్లీ జట్టుతో కలవనున్నాడు. 

టీ20 జట్టు
రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, సంజూ శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రునాల్‌ పాండ్యా, చాహల్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌.
 
టెస్టు జట్టు
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, మయాంక్‌, పుజార, రహానె, విహారి, సాహా, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌.