బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల సౌరవ్ గంగూలీ బాధ్యతలు  చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇండియన్ క్రికెట్ ని ముందుకు తీసుకువెళ్లేందుకు గంగూలీ తన శాయక్తులా ప్రయత్నిస్తున్నాడు. అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం కేవలం 9 నెలలు మాత్రమే కావడంతో... తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ను కలిసి అక్కడి పనితీరుపై ఆరాతీసిన గంగూలీ... తాజాగా మీడియాతో మాట్లాడారు. ద్రవిడ్ పర్యవేక్షణలో ఎన్సీఏను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో ఉన్న హై ఫెర్ఫామెన్స్ సెంటర్ తరహా కేంద్రాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించాడు.

అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి గురించి ప్రశ్నించగా.. గంగూలీ చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. రవిశాస్త్రి మరోలా వాడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. రవిశాస్త్రి ఎప్పటివరకు కోచ్ గా కొనసాగుతాడో అప్పటి వరకు అతని సేవలను ఏఎన్సీఏ లో కూడా భాగం చేస్తామని తెలిపారు.

ద్రవిడ్ తోపాటు రవిశాస్త్రి, పారాస్ మాంబ్రే, భరత్ అరుణ్ లు కూడా ఇందులో పనిచేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎన్సీఏ చాలా పని జరుగుతుందన్నారు. ఎన్సీఏను ఒక అత్యుధ్బుత సెంటర్ గా రూపొందించే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

ఇదిలా ఉండగా..అసలు గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపడుతున్నాడు అనగానే... అందరి దృష్టి రవిశాస్త్రి మీదే పడింది. ఎందుకంటే వీరిద్దరికీ పడదని అందరి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఓ విలేకరి.. టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో మాట్లాడారా అంటూ గూంగూలీని ఓ ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు ఆయన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. రవిశాస్త్రి ఏం చేశాడని నేను ఇప్పుడు మాట్లాడాలి? అని చెప్పి.. గంగూలీ పెద్దగా నవ్వేశాడు. స్పాంటినేయస్ గా... గంగూలీ చెప్పిన సమాధానం అందరి చేత నవ్వులు పూయించింది. గంగూలీ- రవిశాస్త్రి నడుమ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే... రవిశాస్త్రిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉందనే వాదన కూడా వినపడుతోంది.

గతంలో.. రవిశాస్త్రి దాదాపై పలు విమర్శలు చేశారు.  2016లో అనిల్ కుంబ్లీ టీం ఇండియా కోచ్ కావడం వెనుక గూంగూలీ పాత్ర ఉందని... తనకు ఆ అవకాశం రాకుండా చేసింది అతనే అంటూ రవిశాస్త్రి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఏసీలో గంగూలీ ఒక సభ్యుడు కావడం వల్ల తనకు కోచ్ గా రాకుండా చేయడాని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా... గంగూలీ ధోనీ భవిష్యత్తు గురించి కూడా తాజాగా స్పందించారు.  భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడతానని గంగూలీ చెప్పాడు. ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. కొన్ని నిబంధనల్లో మార్పులతో భారత జట్టు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని దాదా తెలిపాడు.