ISPL: ఐపీఎల్‌ తరహాలో మ‌రో కొత్త క్రికెట్ లీగ్‌.. ఐఎస్‌పీఎల్ గ‌ల్లీ క్రికెటర్ల‌కు వ‌రం కానుందా?

Indian Street premier League (ISPL): ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (టీ10 టెన్నిస్ బాల్ లీగ్) వచ్చే ఏడాది మార్చి 2-9 మధ్య జరగనుంది.ఇందులో భారతదేశంలోని ప్రధాన నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు జట్లు పాల్గొంటాయి. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఐఎస్‌పీఎల్ కమిషనర్‌గా ఉన్నారు. 

ISPL : Indian Street Premier League: New Cricket Format To Start From Next Year in india, BCCI Ravi Shastri RMA

T10 Tennis Ball League: భార‌త్ లో మ‌రో క్రికెట్ లీగ్ రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ‌చ్చే ఏడాది నుంచి లీగ్ ప్రారంభం అవుతుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అదే  ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (టీ10 టెన్నిస్ బాల్ లీగ్). ఐపీఎల్ తరహాలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) కొత్త క్రికెట్ టోర్నమెంట్ వ‌చ్చే ఏడాది ప్రారంభం కానుంది.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) టీ10 ఫార్మాట్లో జరగనుంది. వ‌చ్చే ఏడాది మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో మొత్తం 19 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు క్రికెట్ మైదానంలో జరుగుతాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ క‌తా, శ్రీనగర్ కు చెందిన ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్ పీఎల్)లో పాల్గొనే ఒక్కో జట్టులో 16 మంది ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు. ఒక జట్టులో 6 మంది సహాయక సిబ్బంది ఉండవచ్చు. ఒక్కో జట్టుకు రూ.కోటి చొప్పున వేలం వేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఆటగాళ్ల వేలం జరగనుంది. ఒక ఆటగాడి కనీస బిడ్ మొత్తాన్ని రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ట పరిమితిని విధించ‌లేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) టీమ్ లీడర్ గా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నియమితులయ్యారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్ ఆడే క్రికెటర్ల మాదిరిగా ఆడాలని కలలు కనే పదుల సంఖ్యలో యువకుల కోసం ఈ చొరవ తీసుకున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కోశాధికారి ఆశిష్ షెలార్‌, ముంబై క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అమోల్ కాలేలు ఐఎస్‌పీఎల్ క‌మిటీ స‌భ్యులుగా ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios