ఐపిఎల్ 2025 ప్లేఆఫ్స్ కోసం రియాన్ రికెల్టన్, విల్ జాక్స్ స్థానంలో జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌లను ఆడించేందుకు ముంబై ఇండియన్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కీలక సమయంలో ఈ మార్పులు ఎందుకు చేయాల్సి వస్తుందో తెలుసా?
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, బ్యాటర్ రిచర్డ్ గ్లీసన్‌లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాన్ రికెల్టన్, విల్ జాక్స్ స్థానంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్ (MI) తరపున ఐపిఎల్ ప్లేఆఫ్స్ ఆడేలా ఉన్నాయి. ఇప్పటికే వీరితో ఎంఐ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ముంబై ఇండియన్స్ ఆడిన చివరి రెండు గ్రూప్-స్టేజ్ గేమ్‌లకు ముందు జాక్స్ భారతదేశానికి తిరిగి వచ్చాడు, కానీ అంతర్జాతీయ మ్యాచుల కారణంగా అతడు ఐపిఎల్ ముగింపుకు అందుబాటులో ఉండటంలేదు. మే 29 నుండి వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ప్లేఆఫ్స్ తో క్లాష్ అవుతుంది.
ఇక రికెల్టన్ కూడా ఐపిఎల్ ప్లేఆఫ్స్‌కు దూరమవుతుతున్నాడు, సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జట్టు సభ్యులు మే 27 నాటికి స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. దీంతో అతడు స్వదేశానికి వెళ్లిపోనున్నాడు.
వేలంలో అమ్ముడుపోని బెయిర్‌స్టో ఎంఐ లోకి
బెయిర్ స్టో జూన్ 2024 నుండి ఏ ఫార్మాట్‌లోనూ ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించలేదు, మెగా ఐపిఎల్ వేలం 2024లో అమ్ముడుపోలేదు.అతడితో ఎంఐ ఒప్పందం జరిగితే భారతదేశానికి రానున్నాడు.
బెయిర్‌స్టో ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ (2022, 2024) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (2019-21) తరపున ఆడాడు. ఐదు సీజన్లలో 50 ఐపిఎల్ గేమ్‌లలో ఆడాడు. ఈ మెగా లీగ్‌లో 34.54 సగటు, 144.45 స్ట్రైక్ రేట్‌తో 1589 పరుగులతో అతను అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నాడు. అతను రెండు ఐపిఎల్ సెంచరీలు కూడా సాధించాడు. వాటిలో ఒకటి గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై సాధించాడు.
జాక్స్ లేకుంటే ఎంఐకి దెబ్బే
విల్ జాక్స్ ప్రస్తుత ఐపిఎల్ లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 195 పరుగులతో నిలిచాడు. తన ఆఫ్-బ్రేక్‌లతో ఐదు వికెట్లు తీసుకున్నాడు. అదనంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌పై వారి హోమ్ విజయాల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.37 ఏళ్ల గ్లీసన్ గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడి ఐపిఎల్ లో అరంగేట్రం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ (మే 21), పంజాబ్ కింగ్స్ (మే 26)తో జరిగే చివరి రెండు గ్రూప్ స్టేజ్ గేమ్‌లకు ముందు ఎంఐ ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ఈ సీజన్ లో మంచి ఆరంభం లభించకున్నా మధ్యలో పుంజుకుని ఆరు గేమ్‌ల విజయ పరంపరను కొనసాగించింది ఎంఐ.,