మంచి ఊపులో ర‌నౌట్ .. బోరున ఏడ్చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయ‌ర్

IPL 2024 Rahul Tripathi : ఐపీఎల్ 2024 క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో హైద‌రాబాద్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ ప్లేయ‌ర్ రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ క్ర‌మంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు ర‌నౌట్ అయ్యాడు.
 

IPL 2024 SRH: Rahul Tripathi run out in good swing; Sunrisers Hyderabad player breaks down in tears RMA

IPL 2024 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్-2024) క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జ‌ట్లు త‌ల‌ప‌డున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ టీమ్ 19.3 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే ఆలౌట్ ఆయింది. కేకేఆర్ 13.4 ఓవ‌ర్ల‌లో టార్గెట్ ను ఛేదించింది. 

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కెప్టెన్ పాట్ కమిన్స్ హైద‌రాబాద్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లీగ్ ద‌శ‌లో దుమ్మురేసిన హైద‌రాబాద్.. ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్ అంతగా రాణించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టాప్ ఆర్డర్ విఫలమైతే, బౌలింగ్‌లో కూడా ఎలాంటి ఎడ్జ్‌ కనిపించలేదు. జట్టు కోసం పోరాడింది ఒక్క‌ రాహుల్ త్రిపాఠి మాత్రమే. హాఫ్ సెంచ‌రీ కొట్టి మంచి ఊపులో ఉండ‌గా, దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో అతను పెవిలియ‌న్ కు చేరాడు. అయితే, పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా డ్రెస్సింగ్ రూమ్ మెట్లపై ఏడుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

 

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 19.3 ఓవర్లలో 159 పరుగులకే పరిమితం చేసింది కేకేఆర్. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను మరోసారి డకౌట్ కావ‌డం, ఆ త‌ర్వాతి ఓవ‌ర్ లోనే అభిషేక్ శ‌ర్మ కూడా ఔట్ కావ‌డంతో పవర్‌ప్లే లో ఎస్ఆర్హెచ్ పరిస్థితులు మరింత దిగజారాయి. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేస్తూ పవర్‌ప్లేలో నాలుగు వికెట్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ (3), నితీష్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0) లు కీల‌క మ్యాచ్ లో నిరాశ‌ప‌రిచారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 45/4.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో వీరి ఆట‌ను చూడాల్సిందే..

అయితే, మధ్యలో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ లు హైద‌రాబాద్ స్కోర్ ను 100+ దాటించారు. ఒత్తిడిలో ఉన్నా స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. వీరిద్దరూ 37 బంతుల్లో 62 పరుగుల భాగ‌స్వామ్యం అందించారు. రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, 11వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడి క్లాసెన్ ఔటయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే రాహుల్ త్రిపాఠి తన భాగస్వామి అబ్దుల్ సమద్‌తో కలిసి పరుగుల తీసే క్ర‌మంలో రనౌట్ అయ్యాడు. ఒక‌వేళ రాహుల్ త్రిపాఠి ర‌నౌట్ కాకుండా ఉంటే మ్యాచ్ మ‌రోలా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. దురదృష్టవశాత్తు ఔట్ అయిన తర్వాత, అతను పెవిలియన్‌కు తిరిగి వచ్చిన తర్వాత మెట్లపై ఏడుస్తూ కనిపించాడు. అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

IPL 2024 ఫైన‌ల్ కు చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ అక్కడే బోల్తా పడింది.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios