Asianet News TeluguAsianet News Telugu

IPL 2024: విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు జట్టులో ఉన్న ఏకైక లోపం అదే.. !

Tata IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ ఎడిష‌న్ (ఐపీఎల్ 2024) మొత్తం సీజ‌న్ భార‌త్ లోనే జ‌ర‌గ‌నుంది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై-బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆర్సీబీపై ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.  
 

IPL 2024: Only flaw in Virat Kohli's Bangalore team is spin bowling , Aakash Chopra's comments go viral RMA
Author
First Published Mar 17, 2024, 5:02 PM IST

Royal Challengers Bangalore: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్టు త‌న ఆట‌గాళ్ల‌తో ముమ్మ‌రంగా ప్రాక్టీస్ సెష‌న్స్ మొద‌లుపెట్టాయి. దాదాపు అన్ని జ‌ట్ల ఆట‌గాళ్లు ఖ‌రారు అయ్యారు. ఈ క్ర‌మంలోనే క్రికెట్ విశ్లేష‌కులు, చాలా మంది మాజీ ఆటగాళ్లు ఒక్కో జట్టు బలాలు, బలహీనతలపై వ్యాఖ్యానిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గురించి ఆకాష్ చోప్రా చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోలేక‌పోయిన ఆర్సీబీ 17వ సీజన్ లో ఎలాగైనా ఛాంపియ‌న్ గా నిలవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆకాశ్ చోప్రా బెంగ‌ళూరు జ‌ట్టు గురించి మాట్లాడుతూ.. ఆర్సీబీ  జట్టులోని ఏకైక బలహీనత స్పిన్నర్లుగా పేర్కొన్నాడు . 'ఆర్సీబీ జట్టులో ఉన్న ఏకైక లోపం స్పిన్ విభాగం. హసరంగ, షాబాజ్ అహ్మద్ ల‌ను జట్టు నుంచి తప్పించడంతో ఆర్సీబీ వేలంలో నాణ్యమైన స్పిన్నర్లను ఎంపిక చేసింది. జట్టు కొనుగోలు చేయలేదు. బౌలర్లను లెక్కించడం మొదలుపెడితే స్పిన్నర్లు ఎక్కడున్నారు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని' అన్నాడు.

IPL 2024: క్రికెట్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. !

అలాగే, ''మీకు అద్భుతమైన బౌలర్ అయిన కర్ణ్ శర్మ ఉన్నారు. కానీ మీరు అతన్ని ఉపయోగించుకోవడానికి కొంచెం ఇష్టపడరు. మీరు అతన్ని ప్రతిచోటా బౌలింగ్ చేయనివ్వరు. స్పిన్నర్లలో హైదరాబాద్‌కు చెందిన మయాంక్ ఠాగర్‌ను తీసుకున్నారు. మయాంక్ ఠాగర్ బాగానే ఉన్నాడు. అయితే, చెపాక్ మైదానం భ్రమణానికి బాగా సరిపోతుంది. కాబట్టి చెన్నై జ‌ట్టుతో పోలిస్తే ఆర్‌సీబీ స్పిన్‌ అటాక్‌ బలహీనంగానే ఉంది'' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా, ఇప్ప‌టికే బెంగ‌ళూరు-చెన్నై జ‌ట్లు త‌మ తొలి మ్యాచ్  కోసం సిద్ధంగా ఉన్నాయి. అరంభంతో అద‌రగొట్టాల‌ని ఇరు టీమ్స్ భావిస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ కీలక నిర్ణయం.. స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏమిటి?

Follow Us:
Download App:
  • android
  • ios