IPL 2024: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. !
RCB - Virat Kohli: తమ రెండో సంతానం కోసం గత కొంత కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లోకి దిగబోతున్నాడు. బెంగళూరు తరఫున బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ ఎలాగైనా ఈ సారి జట్టుకు టైటిల్ ను అందించాలని చూస్తున్నాడు.
Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ కు సిర్వం సిద్ధమైంది. ఈ మెగా క్రికెట్ లీగ్ మార్చి 22న నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య తొలి మ్యాచ్ జగరనుంది. తొలి మ్యాచ్ తో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీని కోసం ఇప్పటికే ప్రాక్టిస్ షూరు చేశాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా తమ జట్టుతో కలిశాడు.
గతవారమే దాదాపు అన్ని టీమ్ లు తమ పూర్తి జట్టుతో ప్రాక్టిస్ ను మరింత ముమ్మరం చేశాయి. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ జట్టులోకి రాకపోవడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ గత జనవరిలో లండన్ వెళ్లాడు. ఎందుకు వెళ్లాడనే అనేక ప్రశ్నల మధ్య హాట్ టాపిక్ గా మారగా, విరుష్క దంపతులు తమ రెండో బిడ్డకు స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ తో ఆకాయ్ అని పేరు పెట్టినట్టు వెల్లడించాడు.
పిచ్ మార్చారు: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై కైఫ్ ఆరోపణలు
ఎప్పుడు బ్యాట్ పట్టుకుంటాడని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. లండర్ నుంచి భారత్ కు తిరిగి వచ్చాడు. మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 కోసం లండన్ నుంచి కోహ్లీ తిరిగి ముంబై చేరుకున్నాడు. త్వరలోనే ఆర్సీబీ జట్టుతో కలిసి తన ప్రాక్టీస్ ను షురూ చేయనున్నాడు. దీనిపై పలువురు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీ ఐపీఎల్ లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు.
WPL Final 2024: ఢిల్లీ vs బెంగళూరు.. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ పోరు.. టైటిల్ ను గెలిచేది ఎవరు?