టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ కీలక నిర్ణయం.. స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏమిటి?
Stop Clock Rule: స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం బౌలింగ్ చేసే జట్టు తదుపరి ఓవర్‌ను ప్రారంభించడానికి 60 సెకన్ల టైమ్ మాత్రమే తీసుకుంటుంది. ఆ సమయంలోపే వారు తర్వాతి ఓవర్ మొదటి బంతిని వేయాలి. ఒక ఓవర్ ముగిసిన వెంటనే, థర్డ్ అంపైర్ స్టాప్ వాచ్‌ను ప్రారంభిస్తారు.
ICC Stop Clock Rule: టీ20 ప్రపంచకప్ 2024 జూన్‌లో ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టోర్నీకి ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. క్రికెట్ లో స్టాప్ క్లాక్ రూల్ ను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 2023లో ఐసీసీ ఈ నియమాన్ని ఒక ట్రయల్‌గా అమలు చేసింది. స్టాప్ క్లాక్ రూల్ కారణంగా బౌలింగ్ జట్టు ఒక ఓవర్ ముగిసిన తర్వాత నిర్ణీత సమయంలో రెండవ ఓవర్‌ను ప్రారంభించాలి. అంటే ఒక ఓవర్ ముగిసిన 60 సెకండ్ల లోపు కొత్త ఓవర్ ను ప్రారంభించాలి. అలా చేయనందుకు ఈ నియమం ప్రకారం, ఫీల్డింగ్ జట్టుకు జరిమానా విధించబడుతుంది. ఐసీసీ ఈ నిబంధన ఇప్పుడు టీ20లోనే కాకుండా వన్డేల్లోనూ వర్తింపజేయనుంది.
60 సెకన్లలోపు బంతి వేయకుంటే ఐదు పరుగుల పెనాల్టీ..
స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం బౌలింగ్ చేసేటప్పుడు జట్లు తదుపరి బౌలింగ్ సమయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంటే బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్‌ను ప్రారంభించడానికి 60 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది. ఆ సమయంలోపే తర్వాత ఓవర్ మొదటి బంతిని వేయాలి. ఒక ఓవర్ ముగిసిన వెంటనే, థర్డ్ అంపైర్ స్టాప్ వాచ్‌ను ప్రారంభిస్తాడు. ఒక నిమిషం వ్యవధిలో ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్ మొదటి బంతిని బౌలింగ్ చేయడంలో విఫలమైతే అంపైర్ హెచ్చరికను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే, జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా విధించబడుతుంది. అయితే, ఈ నిబంధనను అమలు చేయాలనే నిర్ణయం అంపైర్లదే తుది నిర్ణయం అవుతుంది. అందులో బ్యాట్స్‌మెన్ కారణంగా ఓవర్ ప్రారంభించడంలో జాప్యం జరుగుతుందా అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ఏ పరిస్థితుల్లో స్టాప్ క్లాక్ నియమాన్ని రద్దు చేయవచ్చు?
- ఓవర్ల మధ్య కొత్త బ్యాట్స్‌మెన్ వికెట్‌పైకి వచ్చినప్పుడు.
- అధికారిక డ్రింక్స్ విరామం సమయంలో.
- అంపైర్లు బ్యాట్స్‌మన్ లేదా ఫీల్డర్ గాయానికి ఆన్‌ఫీల్డ్ చికిత్సను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు
- గ్రౌండ్ లోని ఇతర పరిస్థితులను అంఫైర్ గమనించి నిర్ణయం తీసుకుంటారు.
IPL 2024: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. !