ధోని అంటే ఆమాత్రం ఉంటది మరి.. మోహిత్ శర్మ
MS Dhoni - Mohit Sharma : ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ సంచలనం. టీమిండియాను మూడు ఫార్మాట్లలో ఛాంపియన్ గా నిలిపాడు. మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరుగాంచిన ఎంఎస్ ధోని ఎంతో మంది క్రికెటర్లకు స్పూర్తిదాయక ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు.
CSK vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లెజెండరీ ప్లేయర్, మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనికి దాదాపు చివరిదని సమాచారం. అందుకే ధోని స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీని అప్పగించింది. భారత క్రికెట్ సంచలనం సృష్టించి టీమిండియాను మూడు ఫార్మాట్లలో ఛాంపియన్ గా నిలిపాడు ధోని. మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరుగాంచిన ఎంఎస్ ధోని ఎంతో మంది క్రికెటర్లకు స్పూర్తిదాయక ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే పరస్పర గౌరవం, ప్రశంసలు అనేక సందర్భాలు లభిస్తూనే ఉన్నాయి. క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలించే మరో ఘటన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో కనిపించింది.
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ముగిశాక ఇరు జట్లు కరచాలనం చేసుకుంటుండగా, అప్పటి వరకు టోపీ ధరించిన మోహిత్ శర్మ భారత క్రికెట్ కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీతో కరచాలనం చేయడానికి ముందు గౌరవంగా తన క్యాప్ ను తీసి ధోనితో కరచాలనం చేశాడు. ఆ తర్వాత ధోనిని హాగ్ చేసుకుని ముచ్చటించాడు. ఆ దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎంఎస్ ధోనీ అంటే అందరికీ ఎంతో గౌరవమనీ, మోహిత్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ధోని సారథ్యంలో మోహిత్ శర్మ జాతీయ జట్టుతో పాటు ఫ్రాంచైజీ లీగ్లో అరంగేట్రం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే చిదంబరం స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. గుజరాత్ వరుస వికెట్లు కోల్పోయి 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మోహిత్ శర్మ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
RCB VS KKR : విరాట్ కోహ్లీ జట్టు ఆర్సీబీ ఏమీ గెలవలేదు.. యుద్ధం ప్రకటించిన గౌతమ్ గంభీర్ !